ట్రిపుల్ ఆర్ .. ఈ మూవీ కోసం ఎదురుచూశారు. అయితే ఎట్టకేలకు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలనాలు సృష్టించడం మొతదలుపెట్టింది. బాక్సాఫీస్ వద్ద వినీ ఎరుగని స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించడం మొదలుపెట్టింది. ఇప్టపికే ఓవర్సీస్ లో యుఎస్ ప్రీమియర్ ల ద్వారా 3 మిలియన్ డాలర్స్ ని సొంతం చేసుకుని రికార్డుల మోతకు శ్రీకారం చుట్టిన ట్రిపుల్ ఆర్ ఫస్ట్ డే ప్రారంభ వసూళ్ల పరంగానూ చరిత్ర సృష్టించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ప్రదర్శింపబడుతున్న ట్రిపుల్ ఆర్ ప్రతీ ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటూ సంబ్రమశ్చర్యాలకు లోనుచేస్తోంది. ఎక్కడ చూసినా ఇప్పడు ట్రిపుల్ ఆర్ చర్చే జరుగుతోంది. ఈమూవీ సాధిస్తున్న వసూళ్లతో పాటు సాధించేబోయే వసూళ్లపై కూడా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ వర్గాలు ఈ మూవీ చూసి నివ్వెరపోతున్నారు. అంతగా బాలీవుడ్ వర్గాలని ఈ మూవీ షాక్ కు గురిచేస్తోంది. క్రిటిక్స్ సైతం యునానిమస్ గా ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
దర్శకుడు రాజమౌళికి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లకి బ్రహ్మరథం పడుతున్నారు. ఓ అద్భుతాన్ని సృష్టించారని కొనియాడుతున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ రిలీజ్ రోజే సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఇదోక అద్భుతం అని ప్రశంసించారు. బన్నీ కూడా ప్రత్యేకంగా తన ఫ్యామిలీతో కలిసి చూసి ప్రశంసలు కురిపించారు. ప్రత్యేకంగా రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ బావ ఓ పవర్ హౌస్ అని కితాబిచ్చారు. సినిమాపై తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చారు.
శంకర్ కూడా ట్రిపుల్ ఆర్ పై ప్రశంసలు కురిపించి మహారాజ `మౌళి` అంటూ రాజమౌళికి కొత్త పేరు పెట్టారు. ఇదిలా వుంటే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సోసల్ మీడియా ట్విట్టర్ వేదికగా ట్రిపుల్ ఆర్ టీమ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా మహేష్ బాబు తనదైన మార్కు రివ్యూని అందించారు. సినిమాలు.. రాజమౌళి సినిమాలు అని వున్నాయని, ట్రిపుల్ ఆర్ ఎపిక్ అని, గ్రాండియర్ విజువల్స్, మ్యూజిక్, ఎమోషన్స్ ఊహకు అందనివని, ఉత్కంఠభరితమైనవి, అద్భుతమైనవి అన్నారు.
సినిమాలో మిమ్మల్ని మీరు మర్చిపోయే సన్నివేవాలు వున్నాయి. ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ మాత్రమే ఇలాంటి సినిమా చేయగలడు. సెన్సేషనల్ ఫీల్మ్ మేకర్ రాజమౌళి సార్ ని చూస్తుంటే చాలా చాలా గర్వంగా వుంది. తారక్, రామ్ చరణ్ వారి స్టార్ డమ్ ని మించి ఎదుగుతున్నారు. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.
నాటు నాటు పాటలో నేల మీద కాకుండా ఇద్దరూ గాల్లో ఎగురుతున్నట్టుగా కనిపించారు. ఈ స్థాయి భారీ ప్రాజెక్ట్ ని సమర్థవంతంగా తెరపైకి తీసుకొచ్చినందుకు ట్రిపుల్ ఆర్ టీమ్ కి హ్యాట్సాఫ్. చాలా గర్వంగా వుంది` వుంది అంటూ తనదైన స్టైల్లో ట్రిపుల్ ఆర్ పై రివ్యూ ఇచ్చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు.