వెబ్ మీడియా యాక్టివ్ అయ్యాక సినిమా రివ్యూల తీరే మారిపోయింది. ఒకప్పట్లా సినిమా రిలీజైన కొన్ని రోజులకు వీక్లీ మ్యాగజైన్లలో రివ్యూలు వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. కొత్త సినిమా మార్నింగ్ షో పడటం ఆలస్యం.. గంటలో రివ్యూ పడిపోతుంది. దీనిపై సినిమా వాళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. ఫస్ట్ వీకెండ్ వరకు ఆగి.. ఆ తర్వాత రివ్యూలు వేయమంటారు. స్వయంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం ఈ విధమైన విజ్నప్తే చేస్తున్నాడు. రివ్యూల విషయంలో కొంచెం సంయమనం పాటించమని అడుగుతున్నాడు. సినిమా నాలుగు రోజులు థియేటర్లలో ఉండనివ్వమని ఆయన కోరుతున్నాడు.
ప్రభు కొడుకైన విక్రమ్ ప్రభు కొత్త సినిమా ‘నెరుప్పుడా’ ఆడియో వేడుకలో రజినీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ముందు విశాల్ మాట్లాడుతూ.. రివ్యూ రైటర్లు సినిమా రిలీజైన వెంటనే రివ్యూలిచ్చే సంస్కృతి మారాలన్నాడు. మూడు రోజులు అయ్యాక.. వీకెండ్ తర్వాత.. సోమవారం రివ్యూలు పెట్టడం మంచిదని అన్నాడు. ఆ తర్వాత మైకు అందుకున్న రజినీ.. విశాల్ ఆలోచన సరైందే అన్నాడు. వెంటనే ‘‘రివ్యూల ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారన్నది ముఖ్యం. తొలి రోజు కాకుండా నాలుగో రోజు రివ్యూలు ఇవ్వాలన్న విశాల్ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా’’ అని రజినీ అన్నాడు. ఐతే ఇప్పుడు పోటీ యుగంలో రివ్యూల విషయంలో ఇలా సంయమనం పాటిస్తే వెనుకబడిపోవడం ఖాయం కాబట్టి రజినీ సూచనను పాటించడం కష్టం. ఇది అనివార్యం అని ఆయనకు తెలియందేమీ కాదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/