ఇంటికి తిరిగొచ్చాను అంటూ ర‌జ‌నీ జోష్‌

Update: 2021-11-01 04:30 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరార‌ట‌.. ఇంత స‌డెన్ గా ఏమైందీ? అంటూ ఒక‌టే అభిమానులు మీడియా కంగారు ప‌డిపోయిన సంగ‌తి తెలిసిందే. 70 వ‌య‌సులో ఆయ‌న త‌ర‌చుగా అనారోగ్యం భారిన ప‌డుతుండ‌డంతో అంద‌రిలో ఇలాంటి సందేహాలు.. కంగారు! అయితే ర‌జ‌నీకాంత్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారనేది తాజా స‌మాచారం.

ఆస్ప‌త్రి నుంచి ర‌జ‌నీ డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి తిరిగి వచ్చారు. శుక్రవారం చెన్నై- కావేరి ఆసుపత్రిలో కరోటిడ్ ధమని శస్త్రచికిత్స విజ‌య‌వంతంగా జరిగింది. అనంత‌రం ఆయ‌న ఇంటికి చేరుకున్నారు. అత‌డు రాగానే.. ``ఇంటికి తిరిగి వచ్చారు`` అని రజనీకాంత్ ఫోటోతో పాటు ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానుల‌కు సంతోషాన్నిచ్చింది. త‌మ ఫేవ‌రెట్ స్టార్ ఆరోగ్యంగా ఉన్నార‌ని తెలియ‌గానే అంద‌రికీ జీవం వ‌చ్చింది.

ర‌జ‌నీకాంత్ అక్టోబరు 28న ఆస్పత్రిలో చేర‌గా.. వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అతను కోలుకోవడంతో ఆదివారం సాయంత్రం డిశ్చార్జి అయ్యారు. తన నివాసానికి చేరుకున్న రజనీకాంత్ కు ఆయన సతీమణి లత హారతులతో స్వాగతం పలికారు. ఆయన కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. రజనీకాంత్ న‌టించిన తాజా చిత్రం `పెద్దన్న` దీపావళికి విడుదల కావాల్సి ఉంది. త‌మిళంలో ఈ చిత్రం అన్నాథే పేరుతో రిలీజ‌వుతోంది.

`పెద్ద‌న్న`గా త‌డాకా చూపిస్తాడు

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా శివ ద‌ర్శ‌క‌త్వంలో `అన్నాథే` అత్యంత భారీ కాన్వాస్ తో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసింబే. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు ర‌జనీలో మాస్ యాంగిల్ ని ఓరేంజ్ లో ఎలివేట్ చేసాయి. ఇక ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌లైన ట్రైల‌ర్ యూ ట్యూబ్ లో రియార్డులు తిర‌గ‌రాసింది. ర‌జ‌నీ మాస్ అప్పియ‌రెన్స్ మ‌రోసారి పీక్స్ లో క‌నిపిస్తోంది. లుంగీ క‌ట్టిన లుక్ లో సూప‌ర్ స్టార్ ని చూసి చాలా కాల‌మ‌వ్వ‌డంతో ఆ కిక్ ని మ‌ళ్లీ అన్నాత్తే అందించింది. సూప‌ర్ స్టార్ లో మాసిజం మ‌రోసారి అంచ‌నాల్ని మించి ఉండ‌బోతుంద‌ని ట్రైల‌ర్ చెప్ప‌క‌నే చెప్పింది.

తెలుగు టైటిల్ `పెద్ద‌న్న` ఇప్ప‌టికే అభిమానుల్లోకి దూసుకెళ్లింది. అన్నాచెల్లెళ్ల‌ అనుబంధం..కుటుంబ విలువ‌ల నేప‌థ్యంలో చిత్ర‌మిది. ఇందులో ర‌జనీకాంత్ రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ మీద స్టైలిష్ గా క‌నిపిస్తున్న లుక్ ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యింది. క‌త్తి దూసి యాక్ష‌న్ కి దిగే వాడిగా ర‌జ‌నీ క‌నిపిస్తున్నారు. ర‌జ‌నీ అభిమానుల నుంచి ఈ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. అన్న‌ని ఇలా చూసుకుని చాలా కాల‌మ‌వుతోందంటూ అభిమానులు ఫిదా అయ్యారు. పెద్ద‌న్న లో ర‌జ‌నీ స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టిస్తోంది. కీర్తి సురేష్.. మీనా..ఖుష్బూ.. జ‌గ‌ప‌తిబాబు..ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఏషియ‌న్ ఇన్ ప్రా ఎస్టేట్స్ ఎ ల్ ఎల్ పీ నారాయ‌ణ‌దాస్ నారంగ్-సురేష బాబు చిత్రాన్ని తెలుగు..త‌మిళ లో రిలీజ్ చేస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
Tags:    

Similar News