సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 - దర్బార్ చిత్రాలు విడుదలై చాలా కాలమే అయ్యింది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆ రెండు చిత్రాల్లో రజనీ నటన ఆకట్టుకుంది. ఆ తర్వాత పేట - పెద్దన్న (అన్నాథే) చిత్రాలు వచ్చినా అవేవీ పెద్దగా ప్రభావం చూపలేదు. ఒక రకంగా రజనీకి వరుసగా నిరాశాజనకమైన ఫలితాలే ఎదురయ్యాయి. అయితే దేశంలోనే తొలి పాన్ ఇండియా హీరోగా రజనీకాంత్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ఇప్పుడే చెప్పాల్సినదేమీ లేదు. అమితాబ్ సినిమాకి సౌత్ లో ఫాలోయింగ్ లేకపోవచ్చేమో కానీ రజనీ సినిమాకి నార్త్ లో ఫాలోయింగ్ లేని రోజు లేదు. ఆయన సినిమా వస్తోంది అంటే ఉత్తరాదినా బోలెడంత క్యూరియాసిటీ నెలకొంటుంది. జపాన్ - కొరియా దేశాల్లోనూ రజనీ సినిమాలకు ఆదరణ గొప్పగా ఉంటుంది.
అందుకే రజనీకాంత్ లాంటి స్టార్ లేట్ ఏజ్ లో కాస్త తడబడుతున్నా కానీ అతడి కంబ్యాక్ కోసం అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగానే వేచి చూస్తుంటారు. మరి ఇలాంటి సమయంలో రజనీ ఎలాంటి సినిమాతో రాబోతున్నాడు? అన్నదానికి తాజాగా ఆన్సర్ లభించింది. రజనీ టీమ్ నుంచి తాజా ప్రకటన వేడి పెంచుతోంది. ఈ ఆగస్ట్ లో సూపర్ స్టార్ నటించే `జైలర్` షూటింగ్ ప్రారంభం కానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. మూవీ కోసం ప్రస్తుతం హైదరాబాద్ లో సెట్ వేస్తున్నారు.
2021 యాక్షన్ డ్రామా అన్నాత్తే తర్వాత రజనీకాంత్ అభిమానులు అతని తదుపరి చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా తాజా ప్రకటన ఆసక్తినిప పెంచింది. దర్శకుడు నెల్సన్ సూపర్ స్టార్ ని ఏ రేంజులో ఆవిష్కరిస్తారో చూడాన్న ఉత్కంఠ పెరుగుతోంది. జైలర్ అనే టైటిల్ తో రజనీ - నెల్సన్ బృందం క్యూరియాసిటీని పెంచారు. ఈ చిత్రం కోసం హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో ఒక భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. ఈ సంవత్సరం ఆగస్టు రెండవ వారంలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జైలర్ షూటింగ్ కూడా అన్నాథే తరహాలో ఎక్కువ భాగం హైదరాబాద్ లోని ఫిల్మ్ సిటీలో జరగనుంది.
అంతేకాదు .. రజనీకాంత్ ట్యాలెంటెడ్ నెల్సన్ దిలీప్ కుమార్ కు చాలావరకూ క్రియేటివ్ ఫ్రీడమ్ ని ఇచ్చారట. తనకు నచ్చిన కథను నిర్ణయించుకునే స్వేచ్ఛను ఇచ్చినట్లు చెబుతున్నారు. స్క్రిప్ట్ తో పాటు రజనీ సర్ తనకు సరిపోయే విధంగా చిత్రం కోసం ఇతర తారాగణం సిబ్బందిని లాక్ చేయమని చిత్రనిర్మాతను కోరారట. దర్శకుడి ఊహకు క్రియేటివిటీకి ఫలితం దక్కాలని సూపర్ స్టార్ కోరుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్లు పైగా బడ్జెట్ వెచ్చించనున్నారని తెలుస్తోంది.
తాజా గుసగుసల ప్రకారం.. జైలర్ లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రను పోషించనున్నారు. అలాగే ప్రియాంక మోహన్- శివకార్తికేయన్ - రమ్య కృష్ణన్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం సెట్స్ కి వెళ్లేలోపు నటీనటులు - సిబ్బందికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు.
రోబో చిత్రంలో కథానాయికగా నటించిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరోసారి రజనీ సరసన నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. జైలర్ లో కథానాయికగా ఒప్పించేందుకు దర్శకనిర్మాతలు ఐష్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ జంట గతంలో 2010 డ్రామా ఎంథిరన్ (రోబో)లో స్క్రీన్ ను షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. స్క్రీన్ ప్లే పరంగా ఎంతో చమత్కారమైన అంశాలతో ఈ మూవీ తెరకెక్కనుందిట.