టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. సంక్రాంతికి వారం ముందుగానే రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా భారీ ఎత్తున విడుదల చేయడం జరిగింది.
మొదట ఈ ట్రైలర్ ను థియేటర్ల లో స్క్రీనింగ్ చేసి ఆ తర్వాత యూట్యూబ్ ద్వారా రివీల్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్ లోని ప్రతి మూమెంట్ కూడా అద్బుతం అన్నట్లుగా సాగింది.
ఇద్దరు హీరోలను ప్రజెంట్ చేసిన తీరు.. ట్రైలర్ లో సినిమాపై ఆసక్తి కలిగించిన విధానం.. కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ అద్బుతంగా సాగిందంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు హీరోల అభిమానులు కూడా పండుగ చేసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే సహజంగానే ఇండస్ట్రీ గర్వంచే విధంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. బాహుబలి తర్వాత ఆయన చేస్తున్న సినిమా ఇదే అవ్వడం వల్ల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే క్లారిటీ వచ్చేస్తోంది. ఈ ట్రైలర్ పై ఎంతో మంది ఇండస్ట్రీ ప్రముఖులు స్పందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ ట్రైలర్ పై ఆసక్తికర కామెంట్స్ చేయడం జరిగింది.
ట్రైలర్ లోని ప్రతి ఒక్క షాట్ కూడా అద్బుతంగా ఉంది. కథ చెప్పడంలో మాస్టర్ అయిన రాజమౌళి మరోసారి తన ఈ సినిమా తో అద్బుతంను ఆవిష్కరించడం ఖాయం. ట్రైలర్ లోని ఒక్కో షాట్ కు రోమాలు నిక్కపొడుస్తున్నాయంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు.
మహేష్ బాబు ట్వీట్ కు చాలా మంది స్పందిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ పూర్తి అయ్యింది కదా మరి జక్కన్నతో మీ సినిమా ఎప్పుడు అంటూ చాలా మంది ప్రశ్నించారు. రాజమౌళి మరియు మహేష్ బాబుల కాంబోలో సినిమా రాబోతున్న విషయం తెల్సిందే.
సుదీర్ఘ కాలంగా వాయిదా పడుతూ వస్తున్న వీరి కాంబో మూవీని పట్టాలకెక్కించేందుకు సిద్దం అవుతున్నట్లుగా ఆ మద్య రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు.
మహేష్ బాబు కూడా రాజమౌళి తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు మరియు రాజమౌళిల సినిమా 2025 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్.