పంజాబీ సింగర్ సిద్దూ మూస్ వాలా హత్యకు తానే కారణం అంటూ లారెన్స్ బిష్ణోయ్ ఒప్పుకోవడంతో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ విషయంలో ఆయన సన్నిహితులు మరియు పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం లారెన్స్ బిష్ణోయ్ ఒక వీడియో సందేశం లో సల్మాన్ ఖాన్ ను చంపబోతున్నది తానే అంటూ బాహాటంగా ప్రకటించిన విషయం తెల్సిందే.
అప్పట్లో ఆ వీడియో సంచలనంగా మారింది. ఇప్పుడు సిద్దూ మూస్ వాలా హత్య తర్వాత సల్మాన్ ఖాన్ విషయంలో పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ సెక్యూరిటీని టైట్ చేయడంతో పాటు ముందస్తు అరెస్ట్ లు మరియు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ కు గతంతో పోల్చితే రెట్టింపు సెక్యూరిటీని పెంచామని పోలీసు అధికారులు తెలియజేశారు.
సల్మాన్ ఖాన్ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెంచారని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ షూటింగ్ ల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ప్రయాణించే సమయంలో కూడా మునుపటి కంటే ఎక్కవ జాగ్రత్తలు తీసుకునేలా పోలీసులు గైడ్ లైన్స్ పాటిస్తున్నారు. మొత్తానికి సింగర్ సిద్దూ మూస్ వాలా మృతితో సల్మాన్ ఖాన్ విషయంలో అభిమానుల్లో ఆందోళన కనిపిస్తుంది.
ఢిల్లీ పోలీసులు లారెన్స్ బిష్ణోయ్ ను 2018 లో కోర్టుకు తరలిస్తూ ఉండగా కోర్టు బయట సల్మాన్ ను తాను చంపేస్తాను అంటూ ప్రకటించడంతో ఇప్పుడు ఆందోళన మొదలు అయ్యింది. జైల్లో ఉన్నా మరెక్కడ ఉన్నా కూడా లారెన్స్ బిష్ణోయ్ తన నెట్ వర్క్ తో అనుకున్నది చేస్తాడు అనే అనుమానాలు ఉన్నాయి. అందుకే సెక్యూరిటీ విషయంలో అస్సలు ఛాన్స్ తీసుకోవద్దని పోలీసులు భావిస్తున్నారు.
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అతడి సహాయకుడు సన్నిహితుడు అయిన సంపత్ నేహ్రా ఒకానొక సమయంలో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించాడని కూడా వార్తలు వచ్చాయి.
అందుకే సల్మాన్ ఖాన్ విషయంలో మహా రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆయనను చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.