బర్త్‌ డే కానుకగా సూపర్‌ స్టార్‌ 'వేద' ఫస్ట్‌ లుక్‌

Update: 2022-01-10 05:34 GMT
సౌత్‌ సినిమాలు బాలీవుడ్‌ లో రీమేక్ అవ్వడం ఈమద్య కాలంలో చాలా కామన్ విషయం అయ్యింది. సౌత్‌ సినిమాలకు కాస్త రిచ్‌ నెస్ ను జోడించి స్టార్ కాస్ట్‌ పెంచి కాస్త హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా స్క్రిప్ట్‌ లో మార్పులు చేర్పులు చేయడం ద్వారా భారీ విజయాలు నమోదు అవుతున్నాయి. అందుకే సౌత్‌ లో తెరకెక్కిన పలు సినిమాలు ఇప్పటికే హిందీలో రీమేక్ అయ్యి విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకోగా ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు రీమేక్ అవుతున్నాయి. ప్రస్తుతం తమిళ సూపర్‌ హిట్‌ మూవీ విక్రమ్‌ వేదా హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్ రోషన్‌ మరియు సైఫ్‌ అలీ ఖాన్ లు కలిసి ఈ రీమేక్ లో నటిస్తున్నారు.

విక్రమ్‌ వేదా రీమేక్ గురించి గత కొంత కాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సిన విక్రమ్‌ వేదా హిందీ రీమేక్ కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. ఇటీవలే షూటింగ్‌ ప్రారంభం అయిన హిందీ విక్రమ్‌ వేదా నుండి హృతిక్ రోషన్ ఫస్ట్‌ లుక్‌ ను రివీల్‌ చేయడం జరిగింది. ఈ సినిమా లో హృతిక్ రోషన్ 'వేద' సినిమాలో కనిపించబోతున్నట్లుగా అధికారికంగా యూనిట్‌ సభ్యులు ప్రకటించి ఫస్ట్‌ లుక్ ను రివీల్ చేయడం జరిగింది. వేద గా హృతిక్ రోషన్‌ చాలా పవర్ ఫుల్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడు. హృతిక్ రోషన్‌ అభిమానులకు ఫుల్‌ మీల్స్ లాంటి సినిమా ఇది అని.. ఖచ్చితంగా అందరికి కూడా ఈ సినిమా మరియు హృతిక్ పాత్ర నచ్చుతుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.

తమిళంలో విక్రమ్‌ వేదాకు దర్శకత్వం వహించిన పుష్కర్‌ మరియు గాయత్రిల దర్శకద్వయం ఈ రీమేక్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. రాధిక ఆప్టే ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. హృతిక్ రోషన్‌ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసిన ఈ ఫస్ట్‌ లుక్ తో రీమేక్ పై అంచనాలు భారీగా పెరిగాయి. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్‌ మరియు టి సిరీస్ లు మరియు బాలీవుడ్‌ కు చెందిన పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ను 2022 సెప్టెంబర్‌ 30వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కరోనా పరిస్థితులు కఠినంగా లేకుంటే షూటింగ్ ను అనుకున్న సమయంకు పూర్తి చేసి ప్రకటించిన తేదీని విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News