ఓ పక్క ఆందోళన.. మరోపక్క అసంతృప్తి..!

Update: 2022-11-15 16:20 GMT
సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త విని ఆయన్ని కడసారి చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు వస్తున్నారు. హాస్పిటల్ నుంచి నానక్ రాంగూడ కృష్ణ నివాసానికి పార్ధివదేహాన్ని తీసుకెళ్లగా అక్కడ సినీ పరిశ్రమ పెద్దలంతా వచ్చి కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించారు. సాయంత్రం ఐదు గంటలకు గచ్చి బౌల్ స్టేడియంలో అభిమానుల సందర్శనార్ధం ఏర్పాట్లు చేస్తారని అన్నారు. సూర్యస్తమయం అవడం వల్ల ట్రాఫిక్స్ సమస్యలు ఏర్పడవచ్చు అని నానక్ రాంగూడ కృష్ణ నివాసంలోనే కృష్ణ పార్ధివదేహాన్ని ఉంచారు.

బుధవారం ఉదయం 8 గంటలకు కృష్ణ పార్ధివదేహాన్ని పద్మాలయా స్టూడియోస్ కి అభిమానుల సందర్శనార్ధం ఉంచుతారట. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానుల సందర్శనకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మధ్యాహ్నం 12 తర్వాత మహా ప్రస్థానంలో అంత్యక్రియలు చేస్తారని సమాచారం.

ఇప్పటికే గచ్చిబౌలి స్టేడియం కి కృష్ణ పార్ధివదేహం వస్తుందని తెలుసుకున్న అభిమానులు అక్కడకు భారీ ఎత్తున చేరుకున్నారు. అయితే అక్కడకు కృష్ణ గారి పార్ధివదేహాన్ని తీసుకురావట్లేదు అన్న విషయం తెలిసి కొద్దిగా అసంతృప్తి చెందారు. అసలే ఆవేదనలో ఉన్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది మరింత కన్ ఫ్యూజన్ చేసింది.  

బుధవారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు అభిమానులు ఎవరైనా సరే పద్మాలయ స్టూడియోస్ లో కృష్ణ గారిని చివరి చూపు చూసుకోవచ్చు. 12 తర్వాత అంతిమ సంస్కార ఏర్పాట్లు మొదలవుతాయని తెలుస్తుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కృష్ణ పార్ధివదేహానికి నివాళి అర్పించేందుకు బుధవారం హైదరాబాద్ వస్తున్నట్టు తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News