ఏదైనా స్టార్ హీరో సినిమా వచ్చిందంటే.. అప్పటివరకూ థియేటర్లలో ఉన్న చిన్న చిత్రాలను అర్ధాంతరంగా తీసేయాల్సన పరిస్థితి. సినిమా బాగుందనే టాక్ ఉన్నా, కలెక్షన్స్ కళ్లెదురుగా కనిపిస్తున్నా.. స్టార్ హీరోలు, వాళ్ల రికార్డుల కోసం.. థియేటర్లలోంచి తప్పిచే కల్చర్ చాన్నాళ్లుగానే ఉంది.
ఇప్పుడు సూపర్ స్టార్ బ్రహ్మోత్సవం మూవీ విషయంలో ఈ స్టోరీ రివర్స్ అయిపోతోంది. బ్రహ్మోత్సవం చుట్టూ జరుగుతున్న నెగిటివ్ పబ్లిసిటి కారణంగా.. కనీసం వారంపాటు కూడా థియేటర్లను నిలబెట్టుకోలేని పరిస్థితి. పెట్టుబడిలో సగానికి పైగా ఎగిరిపోవడం ఖాయమైపోయింది. ఈ సిట్యుయేషన్ ఇప్పటికే థియేటర్లలో ఉన్న సినిమాలకు ప్లస్ గా మారింది. ముఖ్యంగా సుప్రీమ్- బిచ్చగాడు చిత్రాల వైపు ప్రేక్షకులు అట్రాక్ట్ అవుతున్నారు.
సరైనోడు ఇంకా సత్తా చాటుతున్నా స్క్రీన్ల సంఖ్య తక్కువగా ఉంది. సుప్రీమ్ మాత్రం దాదాపు అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ పెంచేసుకున్నాడు. బ్రహ్మోత్సవం ఎఫెక్ట్ తర్వాత.. సుప్రీమ్ బాగా గెయిన్ అయింది. ఇక కొన్ని ఏరియాల్లో వీకెండ్ ముగిసిపోగానే.. బ్రహ్మోత్సవంను డబ్బింగ్ మూవీ బిచ్చగాడుతో రీప్లసే్ చేస్తుండడం ఆశ్చర్యకరం.