అదేం చిత్రమో కానీ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వివాదాలకు దూరంగా ఉండేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు. ఇందుకు భిన్నంగా తరచూ ఏదో ఒక ఆర్థిక వివాదంలో ఆయన సతీమణి లతా రజనీకాంత్ పేరు వినిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి పరిణామమే ఒకటి చోటు చేసుకుంది. ఒక ఆర్థిక ఒప్పందానికి సంబంధించి సూపర్ స్టార్ సతీమణికి దేశ అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసింది.
రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్ రూ.125 కోట్లతో కొచ్చాడయాన్ పేరుతో భారీ చిత్రాన్ని నిర్మించింది. అయితే.. ఈ యానిమేషన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా హక్కుల అమ్మకానికి సంబంధించి యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని పేర్కొంది. మీడియా వన్ కు లతా డైరెక్టర్ గా ఉన్నారు. సదరు ప్రైవేట్ యాడ్ కంపెనీకి రూ.6.20 కోట్ల మొత్తాన్ని చెల్లించాలంటూ ఫిబ్రవరిలోనే సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
అయితే.. ఆ తీర్పును ఇప్పటివరకూ అమలు చేయలేదు. దీంతో.. ఈ వ్యవహారం మరోసారి సుప్రీం విచారణకు వచ్చింది. దీనిపై సీరియస్ అయిన సుప్రీం.. ఎందుకు చెల్లించట్లేదో చెప్పాలని.. ఎప్పడు చెల్లిస్తారో చెప్పాలంటూ ప్రశ్నించింది.
అసలీ వివాదాన్ని చూస్తే.. భారీ బడ్జెట్ తో నిర్మించిన కొచ్చాడయాన్ పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాల కోసం మీడియా వన్ యాడ్ బ్యూరో నుంచి రూ.10కోట్ల మొత్తాన్ని రజనీ సతీమణి అప్పుగా తీసుకున్నారు. దీని కోసం హామీ సంతకం చేసిన లత.. సినిమా విడుదల తర్వాత వడ్డీతోసహా ఇస్తామని చెప్పి ఇవ్వలేదంటూ ఆరోపించారు.
కొంత మొత్తాన్ని చెల్లించి చేతులు దులిపేసుకున్నారని.. తర్వాత సినిమాను రెట్టింపు ధరకు తమిళ హక్కుల్ని ఈరోస్ ఇంటర్నేషనల్ కు అమ్ముకున్నారని ఆరోపించింది. తీసుకున్న రుణంలో కొంత మొత్తాన్ని తమకు చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఎప్పుడు ఇచ్చే విషయాన్ని చెప్పలేదని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం.. ఈ సంస్థకు బకాయిలున్న మొత్తాన్ని చెల్లించాలని సుప్రీం ఆదేశించింది.