కునాల్ కుమ్రాపై విచారణ పూర్తి.. శుక్రవారం తీర్పు.. సుప్రీం వ్యంగాస్త్రాల

Update: 2020-12-17 14:15 GMT
రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై వ్యంగ్యంగా ట్వీట్లు చేసిన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా పై విచారణ పూర్తయింది. ఇందుకు సంబంధించిన తీర్పు శుక్రవారం వెలువడనుంది. ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో అరెస్టయిన అర్నాబ్ గోస్వామికి సుప్రీం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ కునాల్ వ్యంగంగా ట్వీట్లు చేశారు. ఈ విషయాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. చర్యలకు సంబంధించి ఉత్తర్వులు శుక్రవారం జారీ చేస్తామని తెలిపింది.

కునాల్ కమ్రా చేసిన కామెంట్లపై ఏజీ కేకే.వేణుగోపాల్ గతంలోనే ఘాటుగా స్పందించారు. ఈ మధ్యకాలంలో ప్రజలు అత్యున్నత న్యాయస్థానాన్ని, జడ్జీలను అనుచితంగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, చివరకు శిక్షార్హులవుతున్నారని అన్నారు. కునాల్ ట్వీట్లు దారుణంగా ఉండడమే గాక, హాస్యానికి, ధిక్కరణకు మధ్య ఉన్న లక్ష్మణ రేఖను పూర్తిగా క్రాస్ చేశాయని అన్నారు. భావ ప్రకటనా స్వేఛ్చ పేరుతో అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను తప్పుపడుతున్నారని వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. అయితే.. కునాల్ మాత్రం తాను చేసిన ట్వీట్లలో తప్పు లేదని, తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News