ఇప్పటివరకు మావయ్యల చాటు మెగా ఫ్యాన్ లా నెట్టుకొచ్చిన మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. ఇప్పుడు ''సుప్రీమ్'' సినిమాతో స్టార్ అయ్యాడా? సినిమాకు వచ్చిన తొలిరోజు కలక్షన్లను బట్టి చూస్తుంటే.. అదే నిజం అనిపిస్తోంది. మనోడు చాలామంది యువ హీరోలను దాటేసి నుంచున్నాడు.
''సుప్రీమ్'' సినిమా మొదటి రోజు కలక్షన్లు 4.64 కోట్లు వచ్చాయి. అందులో 4 కోట్లు తెలుగు రాష్ట్రంలలో వచ్చిన వసూళ్లే. అయితే రిలీజ్ రోజున మన దగ్గర వచ్చిన టాప్ 25 వసూళ్ళు చూసుకుంటే.. మొత్తంగా బాహుబలి - మహేష్ బాబు - పవన్ కళ్యాన్ - రామ్ చరణ్ - జూ.ఎన్టీఆర్ - అల్లు అర్జున్ లే ఉన్నారు. ఆ తరువాత ఆ లిస్టులో ఉన్న హీరోలు రవితేజ.. నాగార్జున.. రాజమౌళి ఈగ.. వంటి వారే. ఇప్పుడు 4.64 కోట్ల కలక్షన్ తో ఏకంగా శర్వానంద్ - నాని - అల్లరి నరేష్ - రాజ్ తరుణ్ వంటి డిపెండబుల్ స్టార్లను సైతం దాటేశాడు సాయిధరమ్. ఆ లెక్కన చూస్తే మనోడికి స్టార్ స్టేటస్ వచ్చినట్లే మరి.
అయితే ఇప్పటివరకు వచ్చిన ప్రతీ సాయిధరమ్ సినిమాలోనూ దాదాపు మెగా భజనే ఎక్కువగా కాపాడింది. ఒక్కసారి ఆ భజనను పక్కనెట్టి ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే.. కుర్రాడి రియల్ స్టామినా బయటపడే ఛాన్సుంది. ఎనీవే.. కంగ్రాట్స్ తేజు.