'సోలో బ్రతుకే సో బెటర్' హిట్ తర్వాత మెగాహీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం రిపబ్లిక్. ఫస్ట్ టైం సాయితేజ్ పూర్తి పొలిటికల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ దేవాకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు భారీగా నెలకొన్నాయి. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత దేవాకట్టా నుండి మూవీ రాబోతుండటంతో ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తోంది. ఎందుకంటే దేవాకట్టా ఇదివరకే రచయితగా, దర్శకుడుగా తనలోని ప్రతిభను బయటపెట్టాడు. నిజానికి సినిమాను ఆలోచనాత్మకంగా రూపొందించే దర్శకుల్లో దేవాకట్టా ఒకరు.
ఇదిలా ఉండగా.. రిపబ్లిక్ సినిమా గురించి ఇటీవలే ఓ అప్డేట్ అందించిన సంగతి తెలిసిందే. మేకర్స్ ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా.. రిపబ్లిక్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. కేవలం 64 రోజుల్లో ఎలాంటి కరోనా కేసులు లేకుండా పూర్తి చేశామని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ అందించారు మేకర్స్. అదేంటంటే.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిపబ్లిక్ సినిమా టీజర్ ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుండగా.. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలకపాత్రలలో కనిపించనున్నారు. జే. భగవాన్, పుల్లారావులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.