మొత్తానికి సుప్రీమ్ గట్టెక్కేశాడుగా...

Update: 2016-05-15 07:55 GMT
సమ్మర్ సీజన్లో ఉన్న అడ్వాంటేజీ అదే మరి. ఇక్కడ ఏవరేజ్ సినిమాలు హిట్టయిపోతాయి. హిట్ సినిమాలు సూపర్ హిట్ రేంజికి వెళ్లిపోతాయి. పూర్తి నెగెటివ్ టాక్ వస్తే తప్ప కలెక్షన్లకు ఢోకా ఉండదు. ‘సరైనోడు’ లాంటి డివైడ్ టాక్ వచ్చిన సినిమా ఏ రేంజికి వెళ్లిందో అందరూ చూశారు. ఇప్పుడిక ‘సుప్రీమ్’ వంతు వచ్చింది. ఈ సినిమాకు మరీ గొప్ప టాక్ ఏమీ రాలేదు. మెజారిటీ ఆడియన్స్ ఏవరేజ్ అన్నారు. ఫస్టాఫ్ అందరికీ నచ్చినా.. ద్వితీయార్ధం విషయంలో పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది.

ఓవరాల్‌గా ‘సుప్రీమ్’ సినిమా యావరేజ్ అని తేలింది. ఓవైపు ‘సరైనోడు’ బాగానే ఆడుతుంటే.. పోటీగా విడుదలైన సూర్య సినిమా ‘24’కు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో ‘సుప్రీమ్’ బండి ఏమాత్రం నడుస్తుందో అని సందేహించారంతా. దీనికి తోడు తొలి రోజు ఎక్కువ థియేటర్లలో షోలు పడ్డం వల్ల ‘సుప్రీమ్’కు మంచి కలెక్షన్లే వచ్చాయి కానీ.. రెండో రోజు డ్రాప్ కనిపించింది. దీంతో ‘సుప్రీమ్’ చివరికి ఫ్లాప్ కేటగిరీలోకి చేరిపోయేలా కనిపించింది.

కానీ అంచనాలకు భిన్నంగా ‘సుప్రీమ్’ ఇప్పటికీ మంచి కలెక్షన్లే సాధిస్తోంది. వీక్ డేస్‌ లో వీక్ అయినా.. రెండో వీకెండ్ వచ్చేసరికి ‘సుప్రీమ్’ పుంజుకుంది. ఈ వారం ఏవో రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు తప్ప తెలుగు మూవీస్ రిలీజవ్వకపోవడం ‘సుప్రీమ్’కు కలిసొచ్చింది. కలెక్షన్లు స్టడీగా ఉండటంతో వీకెండ్ వచ్చేసరికి ‘సుప్రీమ్’కు థియేటర్లు కూడా పెంచారు. తొలి వారంలో రూ.13-14 కోట్ల మధ్య షేర్ సాధించిన ‘సుప్రీమ్’ రెండో వీకెండ్లో ఇంకో రూ.3-4 కోట్లయినా షేర్ తెస్తుందని అంచనా వేస్తున్నారు. ఫుల్ రన్లో రూ.19-20 కోట్ల దాకా వచ్చే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే బయ్యర్లందరూ సేఫ్ అయిపోయినట్లే.
Tags:    

Similar News