‘సుప్రీమ్’ సినిమా చూసి జనాలు పెద్దగా ఎగ్జైట్ అయిపోలేదు. పర్వాలేదు.. బాగుంది.. అన్న వ్యాఖ్యానాలే వినిపించాయి కానీ సూపర్ హిట్ టాకేమీ రాలేదు. పైగా మరుసటి రోజే సూర్య సినిమా ‘24’ థియేటర్లలోకి దిగి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో ‘సుప్రీమ్’ బాక్సాఫీస్ జర్నీ అంత సాఫీగా ఏమీ సాగదని అంచనా వేశారు ట్రేడ్ పండిట్స్. థియేట్రికల్ రైట్స్ రూ.20 కోట్లకు పైగా అమ్ముడైన నేపథ్యంలో బయ్యర్లు సేఫ్ జోన్లోకి రావడం కష్టమే అని కూడా అనుకున్నారు.
కానీ చివరికి చూస్తే.. ఈ సినిమా అంచనాల్ని మించి ఆడేసింది. మంచి పబ్లిసిటీతో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం.. తర్వాతి వారం సరైన సినిమా పడకపోవడం.. ‘బ్రహ్మోత్సవం’కు డిజాస్టర్ టాక్ రావడం.. అన్నీ ‘సుప్రీమ్’కు మహబాగా కలిసొచ్చి సినిమా సూపర్ హిట్ రేంజికి వెళ్లిపోయింది. రూ.20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సాయిధరమ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా కేవలం ఒక్క థియేటర్లోనే రూ.50 లక్షల గ్రాస్ వసూలు చేయడం విశేషం.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్లో ‘సుప్రీమ్’ 24 రోజుల్లో రూ.50 లక్షల గ్రాస్ మార్కును అందుకుంది. అంటే రోజుకు సగటున రూ.2 లక్షలు కలెక్ట్ చేసిందన్నమాట ఈ చిత్రం. సాయిధరమ్ లాంటి హీరోకు ఇది చాలా పెద్ద మొత్తమే అని చెప్పాలి. మామూలుగా స్టార్ హీరోలు మాత్రమే క్రాస్ రోడ్స్ లో రూ.50 లక్షల గ్రాస్ మార్కును టచ్ చేస్తారు. ఈ లెక్కల్ని బట్టి ఇకపై సాయిధరమ్ ను సైతం స్టార్ కేటగిరీలోకి చేర్చేయొచ్చేమో.