ఇప్పటివరకు అల్లు అర్జున్ కేస్ లో జరిగిందే.. ఈ మధ్యన సాయిధరమ్ తేజ్ విషయంలో కూడా జరుగుతోందా అనిపిస్తోంది. ఫిలిం ఎనలిస్టులు చెబుతున్న వివరాల ప్రకారం చూస్తే.. క్రిటిక్స్ నెగెటివ్ రేటింగులు ఇచ్చిన బన్నీ సినిమాలన్నీ కమర్షియల్ గా పిచ్చ హిట్లు. అదే విధంగా సాయిధరమ్ విషయంలో కూడా సుబ్రమణ్యం ఫర్ సేల్ యావరేజ్ సినిమా అంటే.. అది 20 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ''సుప్రీమ్'' పరిస్థితి కూడా ఇంతేనా?
ఈ మధ్యనే రిలీజైన ''సరైనోడు'' సినిమాకు యావరేజ్ రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. స్టోరీ లేదని ఏకిపాడేశారు విమర్శకులు. అయితే బన్నీ మాత్రం.. కామ్ గా 100 కోట్లు గ్రాస్ వసూలు చేసుకున్నాడు. ఇంకా వసూలు చేస్తూనే ఉన్నాడు. ఒకవేళ సుప్రీమ్ అండ్ 24 సినిమాలు బీభత్సమైన హిట్టయితేనే క్యాష్ ఇన్-ఫ్లో ఆగేది. ఇక ''సుప్రీమ్'' సినిమాకు కూడా యావరేజ్ రేటింగులో వచ్చాయి. కాని ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం.. ఎమేజింగ్.. జింగ్.. జింగ్.. అంటున్నారు. దానితో సుప్రీమ్ కూడా సమ్మర్ ను సరైనోడు వాడుకున్నట్లు వాడేసుకుని.. అదే రూటులో కలెక్షన్లు విపరీతంగా కొట్టేస్తుందేమో అని ఎనలిస్టుల అంచనా.
కాని అదే నిజమైతే.. ఫ్యూచర్ లో సినిమాలు తీసే దర్శకుడు కంగారుపడాల్సిందే. ఎందుకంటే కథ ఉన్న సినిమా తీయాలా.. లేకపోతే కామెడీ అండ్ యాక్షన్ సీన్లు ఉన్న సినిమాలు తీస్తే చాలా అనే సందేహం వచ్చేస్తోంది మరి. #సుప్రీమ్ #ఎమేజింగ్ #జింగ్ #జింగ్