సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు రానంతవరకు చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఒకోసారి గుర్తింపు లభించినా కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. క్యాజువల్ గా చేసిన క్యారెక్టర్ సూపర్ గా క్లిక్ అయిపోయి ఇక అన్నీ అవే తరహా అవకాశాలు వచ్చేస్తుంటే ఏం చేయాలో తెలియక తల పట్టుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా బోల్డ్ సినిమాల్లో నటించిన హీరోయిన్లకు ఈ ఇబ్బంది బాగా ఎదురవుతుంది. హిందీలో ఘనవిజయం సాధించిన హంటర్ సినిమాను బాబు బాగా బిజీ పేరిట రీమేక్ చేసి ఇటీవల విడుదల చేశారు. ఇంతవరకు మిస్టర్ క్లీన్ ఇమేజ్ తో మెప్పించిన అవసరాల శ్రీనివాస్ ఇందులో హీరోగా చేశాడు. ఈ సినిమాలో చిన్నదాన నీకోసం ఫేం మిస్తీ చక్రవర్తి, తేజస్వి మాదివాడ, సుప్రియ ఐసోలా హీరోయిన్లుగా నటించారు.
హంటర్ సినిమా హిందీలో బాగానే ఆడినప్పటికీ బాబు బాగా బిజీ మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అవసరాల శ్రీనివాస్ బాగానే నటించాడనే పేరొచ్చినా సినిమా జనాలకు నచ్చలేదు. సినిమాలోని ముగ్గురు హీరోయిన్లలో సుప్రియ ఐసోలా మాత్రం ప్రేక్షకులకు తెగ నచ్చింది. ఈ సినిమాలో ఆంటీ పాత్రలో కనిపించి రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయి నటించింది సుప్రియ. ఆన్ స్క్రీన్ పై ఆమె ఒంపుసొంపులు కుర్రాళ్లకు పిచ్చెక్కించేశాయి. ఈ సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ ఎవరైనా వచ్చారూ అంటే అది సుప్రియ కోసమే. దీంతో హాట్ అండ్ బోల్డ్ పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వచ్చేస్తున్నాయి. దర్శకులంతా అవే తరహా పాత్రలు ఆఫ ర్ చేస్తున్నారు.
సుప్రియ ఐసోలాకు టాలీవుడ్ లో ఇది ఫస్ట్ పిక్చరమీ కాదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. మహేష్ బాబు స్టేషన్ లో రైలు దిగి వస్తుంటే అతడి వెనుక పరిగెత్తుకుంటూ వచ్చి సెల్ ఫోన్ తిరిగిచ్చే పాత్ర ఆమె చేసింది. ఈ సీన్ సినిమాలో బాగానే క్లిక్కయినా ఆమె ఎవరో జనాలకు రిజిస్టరవలేదు. ఇప్పుడు బాబు బాగా బిజీతో ఒక్కసారి బ్రేక్ లభించింది. తాను కోరుకుంది ఈ తరహా బ్రేక్ కాదంటూ సుప్రియ నిట్టూరుస్తోంది. హీరోయిన్ గా చేయడానికి రెడీ కానీ సెక్సీ పాత్రలకో... హీరోయిన్ ప్రెండ్ క్యారెక్టర్లతోనో సర్దుకుపోలేనని అంటోంది. అందుకే సెక్సీ పాత్రల ఆఫర్లన్నింటికీ నో చెప్పేస్తోంది. ఛాన్స్ లభిస్తే ఏ స్థాయిలో రెచ్చిపోయి నటిస్తుందో ప్రూవ్ చేసుకుంది కాబట్టి హీరోయిన్ ఛాన్స్ దొరకడం కష్టమేం కాదు.. వెయిట్ అండ్ సీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/