అనిరుద్ ని బీట్ చేసేలా దేవి మాస్టర్ ప్లాన్..!

సూపర్ స్టార్ రజిని సినిమాల్లో అనిరుద్ వాయించే మ్యూజిక్ అయితే ఒక రేంజ్ లో ఉంటుంది

Update: 2024-12-30 21:30 GMT

కోలీవుడ్ యువ సంగీత కెరటం అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించిన సినిమాలు ఆల్మోస్ట్ అన్ని మ్యూజికల్ హిట్లుగా నిలిచాయి. స్టార్ సినిమాలకు యాంగం ఇవ్వడంతో పాటు బిజిఎం తో ఫ్యాన్స్ కి సూపర్ ఫీస్ట్ అందిస్తాడు అనిరుద్. సూపర్ స్టార్ రజిని సినిమాల్లో అనిరుద్ వాయించే మ్యూజిక్ అయితే ఒక రేంజ్ లో ఉంటుంది. ఇలా ప్రతి సినిమాకు తన మార్క్ మ్యూజిక్ తో సత్తా చాటుతున్నాడు అనిరుద్. ఐతే అలాంటి అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ చేసింది హీరో ధనుష్ అని తెలిసిందే.

అనిరుద్ ధనుష్ ఈ కాంబో ఎవర్ గ్రీన్ హిట్. ముఖ్యంగా ధనుష్ తో పాట పాడించడంలో ధనుష్ తర్వాతే ఎవరైనా అన్నట్టు చేశాడు. వీళ్లిద్దరు కలిసి వై దిస్ కొలవెరి డి అని చేసిన హంగామా దేశం దాటి ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకుంది. ధనుష్ పాట పాడాడు అంటే సినిమాకు అదే హైలెట్ అవుతుంది. ఐతే లేటెస్ట్ గా ధనుష్ మళ్లీ పాట పాడుతున్నాడు అయితే ఇప్పుడు పాడుతుంది అనిరుద్ కంపోజింగ్ లో కాదు.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజింగ్ లో.. కుబేర సినిమా కోసం ధనుష్ తన గొంతు సవరించుకుంటున్నాడు.

ధనుష్ పాట పాడటం కూడా తన సినిమాలకు ఒక హిట్ సెంటిమెంట్ కాగా ఇప్పటివరకు అలా పాడిన తన సినిమాలు చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి. ఐతే ధనుష్ ఇప్పటివరకు ఎక్కువగా అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్ లోనే పాట పాడాడు. కానీ ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ తో కలిసి సాంగ్ పాడుతున్నాడు. ఈ సాంగ్ తో దేవి తన మార్క్ చూపించాలని చూస్తున్నాడు. ఐతే అనిరుద్ సాంగ్ తో పోటీ కాదు కానీ దేవి కంపోజింగ్ లో ధనుష్ పాట అనేసరికి ఫ్యాన్స్ లో ఎగ్జైట్ మెంట్ మొదలైంది.

ముఖ్యంగా శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్ చేస్తున్న కుబేర సినిమా కోసం ధనుష్ పాట పాడటం ఆ సినిమాకే హైలెట్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు. మరి అనిరుద్ సాంగ్ ని బీట్ చేసేలా దేవి ఈ పాట కంపోజ్ చేస్తాడా లేదా అన్నది చూడాలి. ధనుష్ కుబేర సినిమాలో కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. మరి ధనుష్ సింగేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News