అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోయిన్ గా 1996 లో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా పవన్ కళ్యాణ్ కు డెబ్యూ సినిమా అనే విషయం తెలిసిందే కదా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా మారాడు గానీ సుప్రియ మాత్రం మరో సినిమాలో నటించలేదు. దాదాపు 22 ఏళ్ళ తర్వాత అడివి శేష్ 'గూఢచారి' సినిమాలో ఓ కీలక పాత్ర పోషించడం ద్వారా టాలీవుడ్ రీ-ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజే 'గూఢచారి' రిలీజ్ అయిన విషయం తెలిసిందే కదా.
సుప్రియ ఈ సినిమాలో రా-ఆఫీసర్ నదియా ఖురేషి పాత్రలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా కనిపించింది. అడివి శేష్ తదితరులున్న త్రినేత్ర టీమ్ కు తను క్రావ్ మగ అనే మార్షల్ ఆర్ట్స్ ఫామ్ లో శిక్షణనిస్తుంది. సినిమాలో సుప్రియది ఓ అతిథి పాత్ర మాత్రమే అని ప్రచారం సాగినా అందుకు భిన్నంగా సినిమా అంతా కనిపించే పాత్ర దక్కింది. ఒక రకంగా సుప్రియకు 'గూఢచారి' సినిమా ద్వారా సూపర్ రీ-ఎంట్రీ లభించినట్టే.
ఈ సినిమాతో టాలీవుడ్ మేకర్స్ సుప్రియకు మరికొన్ని ప్రాధాన్యత కలిగిన రోల్స్ ఆఫర్ చేసే అవకాశం ఉంది. మరోవైపు 'గూఢచారి' సినిమా మంచి టాక్ తో ఓపెన్ కావడం విశేషం. ఈ సినిమాతో డెబ్యూ డైరెక్టర్ శశికిరణ్ కు కుడా ప్రశంసలు లభిస్తున్నాయి.