సుప్రియ యార్లగడ్డ.. ఈ హీరోయిన్ ను దాదాపు అంతా మర్చిపోయారు. కానీ, పవన్ కల్యాణ్ సంగతో.. ఆయన పేరు చెబితే అభిమానులు ఎగిరిగంతేస్తారు. విచిత్రంగా పవన్ కల్యాణ్ - సుప్రియ యార్లగడ్డ.. 22 ఏళ్ల కిందట ఈ ఇద్దరూ ఒకే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ‘‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’’ అనే ఈ సినిమాలో హీరో పవన్ అయితే.. హీరోయిన్ సుప్రియ. కానీ, సుప్రియ సినీ ప్రయాణం అక్కడితో ఆగిపోయింది. పవన్ మాత్రం స్టార్ హీరోగా మారారు. మళ్లీ ఇన్నాళ్ల తరువాత సుప్రియా ఇప్పుడు వెండితెరపై గూఢచారి సినిమాతో రీఎంట్రీ ఇచ్చి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె తన తొలి సినిమా హీరో పవన్ గురించి మాట్లాడుతూ... ఆయన ఈ స్థాయికి వస్తారని అస్సలు ఊహించలేదని చెప్పారు. తొలి సినిమా తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా అన్నపూర్ణ స్టుడియో వ్యవహారాలు చూసుకోవడంలో మునిగిపోయారు. ఇప్పుడు గూడఛారి సినిమాతో రీఎంట్రీ తరువాత సినిమా సక్సెస్ నేపథ్యంలో అనేక విషయాల గురించి ఆమె ముచ్చటించారు.
పరిశ్రమ నుండి చాలా మంది వారి స్క్రిప్టులను వినిపించి వాటి గురించి నా అభిప్రాయాన్ని అడుగుతారు. శశి - అడివి శేష్ నా దగ్గరికి వచ్చినప్పుడు అదే అనుభూతి కలిగింది. స్క్రిప్ట్ ను వివరించిన తరువాత, శేష్ నదియా ఖురేషీ పాత్రలో నన్ను నటించమని అడిగాడు. నేను నటించడం మానేసి 22 ఏళ్లయింది.. ఆడిషన్ చేశాక నచ్చితే ఓకే చేయండి అని వారికి క్లియర్ గా చెప్పాను. ఆ ఆడిషన్ తో చాలాకాలం తర్వాత నేను మళ్లీ కెమెరాను పేస్ చేశాను.
ఇరవయ్యేళ్ల కిందటికి ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయి. అప్పట్లో తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు చేయమంటే పవన్‌తో ఆ సినిమా చేశాను. మళ్లీ ఇదే కెమేరాను ఫేస్ చేయడం. తొలి రోజు అడ్జస్ట్ కావడానికి కాస్త సమయం పట్టింది. తరువాత మళ్లీ మామూలైపోయింది. ముఖ్యంగా తెలుగులో ఇలాంటి కొత్త రకమైన సినిమాని ప్రయత్నిచడం నచ్చి ఆసక్తితో నటించాను.
మంచి పాత్రలు వస్తే ఇకపై నటించాలని అనుకుంటున్నాను. ఆడియోను నిర్వహించడం అలాగే ప్రొడక్షన్ హౌస్ ను ముందుకు తీసుకెళ్లడం నాకు పెద్ద బాధ్యత. ప్రారంభంలో - నేను ఒక రచయిత కావాలని, కొన్ని స్క్రిప్ట్స్ రాశాను. తరువాత నటిని అయ్యాను, ఇప్పుడు నేను అన్నపూర్ణ నిర్వహణను చూసుకుంటున్నాను. మా తాత ప్రజల్లో ఒక బలమైన ముద్ర వేశారు. ఆయన మనుమరాలు బాగా చేసిందని ఇప్పుడీ సినిమా తరువాత ప్రేక్షకులు పొగుడ్తూ ఉంటే సంతోషంగా ఉంది. ఇకపై యాక్టింగ్ కంటిన్యూ చేస్తా. నాకు నెగటివ్ షేడున్న క్యారెక్టర్స్ అంటే ఇష్టం. ఆ తరహా కథలొస్తే వదిలిపెట్టను.