ఇవన్ వేరమాదిరి అనే తమిళ సినిమాతో కథానాయికగా పరిచయమైంది సురభి. గజరాజు ఫేం విక్రమ్ ప్రభు సరసన నాయికగా నటించి మురిపించింది. మొదటి సినిమాతోనే ఈ అమ్మడిలో విషయం ఉందండోయ్ అన్న ప్రశంస అందుకుంది. ఆ సినిమా తర్వాత ధనుష్ వీఐపీ (వేలై ఇళ్ల పట్టాధారి) చిత్రంలో ఓ ఇంట్రెస్టింగ్ రోల్ లో కనిపించింది. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎటాక్ అనే తెలుగు మూవీలో నటిస్తోంది. సేమ్ టైమ్ శర్వానంద్ సరసన ఎక్స్ ప్రెస్ రాజా మూవీలోనూ నాయికగా నటించింది.
అయితే మొదటి సినిమా సురభికి, ఐదో సినిమా సురభికి బోలెడంత వైవిధ్యం కనిపిస్తోంది. అరే నోట్లో వేలు పెడితే కొరకదే అన్నట్టు మొదటి సినిమాలో కనిపించింది. అమాయకురాలిలా, సాంప్రదాయ బద్ధంగా కనిపించింది. చుడీదార్ లు - చీరల్లో ఎంతో హోమ్లీగా కనిపించింది. కానీ ఇంతలోనే ఎంత మార్పు? ఈ అమ్మడు ఎక్స్‌ప్రెస్ రాజా సరసన ఎక్స్ ప్రెస్ స్పీడ్ చూపించింది. ఓ చిన్న సాంగ్ బిట్ టీజర్ ని నెట్ లో వదిలారు. ఈ టీజర్ లో సురభి కనిపించిన తీరు కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించింది.
పొట్టినిక్కరుతో సెగల్ రేపింది. సురభి కాటుక కళ్లు కాస్తా విప్పారి ఆల్చిప్పల్లా మారాయి. హెయిర్ రంగు మారి లైట్ బ్రౌన్ అయ్యింది. ఇంకా యాక్సెసరీస్ .. మోడ్రన్ గా మారాయి. ఇదంతా చూస్తుంటే అమ్మడిలో మేకోవర్ - ఛేంజోవర్ ఓ రేంజులో ఉందనిపిస్తోంది. తెలుగులో వరుసగా అవకాశాలు కొట్టేసే ఛాన్సుంది మరి. పెర్ఫామెన్స్ కి గ్లామర్ ని యాడ్ చేసి దూసుకుపోతోందిప్పుడు. ఆల్ ది బెస్ట్ అమ్మడూ!
Full View