ఢిల్లీ భామ అయినా.. సౌత్ లోనే తన లక్కు పరీక్షించుకుంటోంది సురభి. తమిళ్-తెలుగు సినిమాల్లో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయ్ కానీ.. ఈ భామకు బ్రేక్ మాత్రం రావడం లేదు. ఇప్పటికే కోలీవుడ్ లో 4, టాలీవుడ్ లో 4 సినిమాలను రిలీజ్ చేసేసింది. వీటిలో హిట్స్ కూడా ఉన్నా అమ్మడికి ఉపయోగమేమీ లేదు. తెలుగులో ఎక్స్ ప్రెస్ రాజా.. జెంటిల్మన్ లాంటి హిట్స్ పడ్డా.. అవి కెరీర్ కి మాత్రం ఉపయోగపడలేదు.
రీసెంట్ గా హైద్రాబాద్ లో సందడి చేసింది సురభి. ఓ మొబైల్ తయారీ కంపెనీకి చెందిన ఫోన్లను లాంఛ్ చేయడానికి వచ్చింది. ఈవెంట్ బాగానే ఉంది కానీ.. సురభి కూడా బాగానే మెరిసింది. మరి ఛాన్సుల సంగతేంటి అంటే మాత్రం.. ఆఫర్స్ ఉన్నాయిలే అంటూ కవర్ చేసేసింది. ఈ ఈవెంట్ లో అమ్మడి గెటప్ చూస్తే.. గ్లామర్ యాంగిల్ కి ఈ భామ ఎంత దూరమో అర్ధమవుతుంది. అయితే.. కాసింత భారీ పర్సనాలిటీ కావడంతో.. అలాంటి రోల్స్ కుదరవు కానీ.. మరీ నిండుగా కప్పేసుకునే హీరోయిన్లకు తెలుగు మూవీ మేకర్స్ అంతగా ఆఫర్స్ ఇవ్వరనే సంగతి జగద్విదితమే.
ఈ విషయాన్ని అర్ధం చేసుకున్న బొద్దు భామలు కాసింత సైజులు తగ్గించుకుని మరీ ఆఫర్స్ పట్టుకుపోతున్నారు. మరి ఈ విషయం సురభికి ఎప్పుడు అర్ధమవుతుందో!