ప్చ్‌.. ప్రభాస్‌ ఆమెకె పెద్ద అభిమానా?

Update: 2015-12-20 08:00 GMT
శర్వానంద్ - సురభి హీరో హీరోయిన్లుగా నటించిన ఎక్స్ ప్రెస్ రాజా మూవీ రిలీజ్ కి రెడీ అయింది రీసెంట్ గా హైద్రాబాద్ లో ఆడియో వేడుకను కూడా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి రెబెల్ స్టార్ ప్రభాస్ హాజరయ్యాడు. సినిమాకు, నటీ నటులకు తన మాటలతోనే బూస్ట్ అందించాడు ప్రభాస్. ఎక్స్ ప్రెస్ రాజా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు డార్లింగ్.

ఈ ఫంక్షన్ లో పాల్గొన్న వాళ్లు కూడా ప్రభాస్ ని ఆకాశానికి ఎత్తేశారు. అంత పెద్ద స్టార్ అయి ఉండీ. తాము అడగ్గానే ఫంక్షన్ కి వచ్చింది కృతజ్ఞతలు చెప్పారు. అందిరిలోకి హీరోయిన్ చెప్పిన మాటలు మాత్రం హాట్ టాపిక్ గా నిలిచాయి. బాహుబలి దృష్టిలో పడేందుకు తనకు తోచిన అన్ని ప్రయోగాలు చేసేసింది సురభి. ముఖ్యంగా తెలుగులో మాట్లాడేందుకు నానా కష్టాలు పడుతున్నా.. వీలైనంత వరకూ తెలుగులోనే మాట్లాడి ఈ ఢిల్లీ పిల్ల అబ్బురపరిచింది. మాటల మధ్యలో "ప్రభాస్ సార్.. నాకు చాలా పెద్ద ఫ్యాన్" అనేసింది. దీంతో అందరూ ఆశ్యర్యంలో మునిగిగోపోయారు. తెలుగు సరిగా రాకపోవడంతోనే ఈ తంటా అని అర్ధం చేసుకున్న యాంకర్.. దగ్గరకెళ్లి అసలు విషయం, ఆమె చెప్పిన మాటకు అర్ధం వివరించింది. అంతే కాదు కరెక్ట్ చెప్పాలంటే ఏమనాలో కూడా ట్రైనింగ్ ఇచ్చింది.

దీంతో తన మాటలను సరి చేసుకుని.. "నేను చాలా పెద్ద ఫ్యాన్ ప్రభాస్  సార్ కి" అనింది సురభి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా చప్పట్లతో కొట్టారు. తెలుగు రాకపోయినా.. ఎంతో కష్టపడి అయినా మాట్లాడిన సురభికి ప్రశంసలు దక్కాయి. మరోవైపు. ఈ ఇన్సిడెంట్ ని లైట్ గా తీసుకుని నవ్వుతూ ఉండిపోయాడు బాహుబలి.
Tags:    

Similar News