ఎక్స్ ప్రెస్ పాపపై కన్నేసిన పూరీ

Update: 2016-02-10 04:06 GMT
రెండు వరుస ఫ్లాప్ లు, వ్యక్తిగత వివాదాల తర్వాత ఇప్పుడు పూరీ జగన్నాధ్ చాలా అలర్ట్ గా ఉన్నాడు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో కేర్ ఎక్కువగా తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఒకే రోజు ఇద్దరు నందమూరి హీరోలతో ఓకే చెప్పించుకున్న ఈ డైరెక్టర్.. ఇప్పుడు ఈ సినిమాల కోసం మిగిలిన క్యాస్టింగ్ ఎంపికలో పడ్డాడు.

హీరోయిన్స్ ఎంపిక విషయంలో పూరీ చాలా ఎలర్ట్ గా ఉంటాడనే చెప్పాలి. పూరీ సినిమాల్లో నటించిన హీరోయిన్లు, ఐటెం భామలకు కెరీర్ గ్రాఫ్ చాలా స్పీడ్ గా పైకి వెళుతుందనే టాక్ ఉంది. ఇప్పుడీ దర్శకుడు కళ్యాణ్ రామ్ తో తను చేయబోతున్న సినిమా కోసం సురభిని సంప్రదిస్తున్నాడని తెలుస్తోంది. ఎక్స్ ప్రెస్ రాజా మూవీలో శర్వానంద్ తో ఆడిపాడిన సురభికి.. ఆ మూవీ  హిట్ కావడంతో మంచి పేరే వచ్చింది. యాక్టింగ్ తో పాటు గ్లామర్ విషయంలోనూ పెద్దగా బోర్డర్స్ లేకపోవడంతో మంచి అవకాశాలే అమ్మడి తలుపు తడుతున్నాయి.

కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించి, హీరోగా నటించనున్న సినిమాలో ఈ నందమూరి హీరోకి జంటగా సురభి దాదాపు కన్ఫాం అయినట్లే అంటున్నారు. జ్యోతిలక్ష్మి - లోఫర్ ఫ్లాప్ ల కారణంగా.. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్.
Tags:    

Similar News