క్లాస్‌ రోల్‌ లో ఇరగదీశానంటోంది

Update: 2016-04-30 05:59 GMT
కృష్ణగాడి వీర ప్రేమగాధ తర్వాత.. నేచురల్ స్టార్ నాని ఇప్పుడు జెంటల్మన్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నాని ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో.. ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే జంటిల్మన్ కు సంబంధించి రెండు లుక్ లను రిలీజ్ చేయగా.. రెండింటింలోను నాని విభిన్నంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు.

జంటిల్మన్ లో నాని సరసన సురభి - నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. తన కేరక్టర్ గురించి పలు సంగతులు పంచుకుంది సురభి. ఓ ఔత్సాహిక ఆంట్రప్రెన్యూర్ పాత్రలో నటిస్తోందట సురభి. భవిష్యత్ పై బోలెడంత నమ్మకం ఉండే ఈ ఐశ్వర్య పాత్రకు.. ప్రేమపై మాత్రం ఎలాంటి నమ్మకం ఉండదట. 'నాకు పెర్ఫామ్ చేయడానికి బోలెడు అవకాశం పాత్ర ఉన్న జంటిల్మెన్ లో లభించింది. నేను రిచ్ గాళ్ గా నటిస్తుండడంతో క్లాస్ గా కనిపిస్తాను, అంతే తప్ప మెరిసిపోయే రోల్ కాదు' అని చెప్పింది సురభి.

నాని లాంటి యాక్టర్ నటించడం తన అదృష్టంగా చెప్పిన సురభి 'నాని చాలా సహజమైన నటుడు. గతంలో అతని సినిమాలు చూసినప్పుడే, నానితో నటించే ఛాన్స్ కోసం ఎదురుచూశాను. ఇప్పుడు ఆన్ సెట్స్ పై మేమిద్దం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం' అంటూ మురిసిపోతోంది  సురభి.
Tags:    

Similar News