ఆర్ యూ వర్జిన్ ప్రశ్నకు సురేఖ వాణి కూతురు సమాధానం

Update: 2021-05-25 07:30 GMT
టాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితురాలైన సురేఖ వాణి కూతురు సుప్రీత సోషల్‌ మీడియాలో ఈమద్య కాలంలో చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. తల్లి సురేఖ వాణితో ఇన్ స్టా రీల్స్ చేయడంతో పాటు రెగ్యులర్‌ గా అభిమానులతో చిట్ చాట్‌ చేస్తూ కనిపిస్తూ వస్తుంది. సోషల్‌ మీడియాలో దాదాపుగా నాలుగు లక్షల మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న సుప్రీత మరింతగా పాపులర్‌ అయ్యేందుకు ఎప్పుడు కూడా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూనే ఉంది. ఫాలోవర్స్‌ కొన్ని సార్లు అసభ్యంగా కామెంట్స్ చేసినా కూడా కూల్‌ గా తల్లి మాదిరిగా సమాధానం ఇవ్వడంలో సుప్రిత పరిణితి సాధించింది.

ఇటీవల ఫాలోవర్స్ తో చిట్‌ చాట్ చేస్తున్న సమయంలో ఒక నెటిజన్ ఆర్‌ యూ వర్జిన్ అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్న ఏ అమ్మాయిని అడిగినా కూడా కోపం కట్టలు తెంచుకుంటుంది. సెలబ్రెటీలను కామెంట్స్ రూపంలో ఈ ప్రశ్న అడిగితే ఎక్కువ శాతం మంది ఆ వ్యక్తిని బ్లాక్ చేయడం లేదంటే మౌనంగా ఉండటం చేస్తారు. కాని సుప్రిత మాత్రం తనకు వచ్చిన ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. అయితే సుప్రీత ఇచ్చిన సమాధానం చాలా యూనిక్ గా ఉంది. ఆమె ఇచ్చిన సమాధానంకు అవతలి వ్యక్తి మైండ్ బ్లాంక్‌ అయ్యి ఉంటుంది.

వకీల్ సాబ్ సినిమాలోని పవన్ కోర్టు సీన్ లోని ప్రకాష్ రాజ్‌ పై ఊగిపోతు ఐ అబ్జెక్షన్‌ అనే డైలాగ్‌ ఉంటుంది. ఆ డైలాగ్‌ ను సుప్రీత ఆ ప్రశ్నకు సమాధానంగా పోస్ట్‌ చేసింది. ఆ ప్రశ్న తనకు ఎంతగా చిరాకు కలిగించిందో ఆ పోస్ట్‌ తో చెప్పకనే చెప్పింది. ఇలాంటి ప్రశ్నలు అడగడం ఏమాత్రం సబబు కాదంటూ కొందరు సుప్రీతకు మద్దతుగా కామెంట్స్ చేయగా మరి కొందరు ఆమె సమాధానం పై ప్రశంసలు కరిపిస్తూ స్పందిస్తున్నారు. ఇక సుప్రీత ను హీరోయిన్ గా పరిచయం చేసేందుకు సురేఖ వాణి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆమద్య వార్తలు వచ్చాయి. వాటిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Tags:    

Similar News