ఇటు బుల్లితెర ప్రేక్షకులకు .. అటు వెండితెర ప్రేక్షకులకు సురేఖా వాణి బాగా పరిచయం. తన గ్లామర్ తోను .. నటనతోను ఆమె ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కేరక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమం ద్వారా తన గురించిన అనేక విషయాలను పంచుకున్నారు. " నేను 10వ తరగతి చదవడానికి ముందే సిటీ కేబుల్ ద్వారా యాంకర్ గా పరిచయమయ్యాను. ఆ తరువాత హోస్ట్ గా కూడా చేస్తూ వచ్చాను. యాంకర్ గా వచ్చిన క్రేజ్ కారణంగానే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
నా పెళ్లికి ముందు నేను చేసిన మొదటి సినిమా 'తెలుగోడు'. ఆ తరువాత కొన్ని సినిమాలు చేస్తూ వెళ్లాను. చిరంజీవిగారు నా అభిమాన నటుడు. ఆయనతో కలిసి తొలిసారిగా నటించే అవకాశం వచ్చినప్పుడు సెట్లోనే ఏడ్చేశాను. అప్పుడు ఆయనే ఓదార్చారు కూడా. ఆ తరువాత 'స్టాలిన్'లోను మంచి రోల్ చేశాను. పెళ్లి తరువాత మా అత్తగారు వాళ్లు సినిమాలకి దూరంగా ఉండమని అన్నారు. కానీ మా వారే ప్రోత్సహించారు. అప్పటి నుంచి మళ్లీ నటించడం మొదలుపెట్టాను.
ఇక నేనూ లైఫ్ లో బాగా సెటిల్ అయ్యాననీ .. అందువలన సినిమాలు చేసే ఉద్దేశంతో లేననే ఒక రూమర్ షికారు చేస్తోంది. సెటిల్ కావడం అంటే ఏమిటి? ఇల్లు .. కారు కొనుక్కుంటే సెటిల్ అయినట్టేనా? అలా అనుకుంటే పెద్ద పెద్ద స్టార్లు సినిమాలు ఎందుకు చేస్తారు? అలాంటి స్టార్ల ముందు నేను ఎంత? పని చేయకపోతే ఏం చేస్తాం? అసలు ఈ పుకారు ఎలా పుట్టిందో .. ఎందుకు పుట్టిందో నాకు తెలియదు. పోనీ ఎవరూ కూడా నాకు కాల్ చేసి క్లారిటీ తీసుకోవడం లేదు. సినిమా అంటే నాకు ప్రాణం .. సినిమాలకు నేను ఎప్పటికీ దూరం కాను" అని చెప్పుకొచ్చారు.