తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటీవలే సీజన్ 5 లోగోను కొత్తగా ఆవిష్కరించిన విషయం తెల్సిందే. లోగోను విడుదల చేయడంతో షో అతి త్వరలోనే ప్రారంభం అవ్వబోతుందని తేలిపోయింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెలలో మొదటి వారంలో లేదా రెండవ వారంలో సీజన్ 5 ను మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ సీజన్ 5 కు సంబంధించిన సెట్టింగ్ ను నిర్మిస్తున్నారు. మరో వైపు కంటెస్టెంట్స్ తో చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల చివరి వరకు కంటెస్టెంట్స్ విషయంలో తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రతి సీజన్ లో ఒక సీనియర్ నటిని హౌస్ లోకి పంపిస్తున్నారు. గత సీజన్ లలో హేమ.. కరాటే కళ్యాణి లను అంతకు ముందు కూడా హౌస్ లోకి స్టార్స్ ను పంపించడం జరిగింది. ఈ సీజన్ లో ఆ ప్లేస్ ను సీనియర్ నటి సురేఖ వాణి భర్తీ చేస్తుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది.
మొన్నటి వరకు సురేఖ వాణి బిగ్ బాస్ పై పెద్దగా ఆసక్తి చూపించలేదు. గతంలో పలు ఇంటర్వ్యూల్లో బిగ్ బాస్ కు వెళ్తారా అంటే లేదు అనే సమాధానం చెప్పింది. మొదటి సీజన్ నుండి కూడా ఈమెను నిర్వాహకులు సంప్రదిస్తూనే ఉన్నారట. ఇటీవల ఈమె సీజన్ 5 కు ఓకే చెప్పిందనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై సురేఖ వాణి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ తాను బిగ్ బాస్ కు వెళ్లబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని తేల్చి చెప్పింది. తనకు ఆ ఉద్దేశ్యం లేదని అవి ఫేక్ వార్తలు అంటూ సోషల్ మీడియా లో స్టోరీ పోస్ట్ చేసింది. సురేఖ వాణి షేర్ చేసిన స్టోరీతో అంతా కూడా ఆమె బిగ్ బాస్ లో లేదని అనుకున్నారు. అయితే ఆ స్టోరీని వెంటనే ఆమె డిలీట్ చేయడం తో అసలు ఏం జరిగింది అంటూ చాలా మంది చాలా రకాలుగా ఆమెను ప్రశ్నిస్తున్నారు.
సోర్టీని డిలీట్ చేయడం వల్ల ఆమె బిగ్ బాస్ లో ఉండబోతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సురేఖ వాణి మొదట బిగ్ బాస్ టీమ్ తో జరిపిన చర్చలు ఓకే అవ్వలేదు. దాంతో ఆమె తాను బిగ్ బాస్ లో ఉండబోతున్న వార్తలు ఫేక్ అంది... ఆ తర్వాత బిగ్ బాస్ తో జరిపిన చర్చలు సఫలం అవ్వడం వల్ల ఆమె మళ్లీ ఎంట్రీ కి ఓకే చెప్పి ఫేక్ అంటూ పోస్ట్ చేసిన స్టోరీని డిలీట్ చేసి ఉంటుందని కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి డిలీట్ చేసి తాను బిగ్ బాస్ సీజన్ 5 లో ఉండబోతున్నట్లుగా సురేఖ క్లూ ఇచ్చినట్లు అయ్యింది అంటున్నారు. ప్రస్తుతానికి ఈ విషయం పై ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేయదు. ఎందుకంటే బిగ్ బాస్ కు వెళ్లబోతున్నవారు ఎవరు కూడా విషయాన్ని రివీల్ చేయకూడదు. ఒక వేళ ఆమె వెళ్లకుంటే మళ్లీ ఫేక్ న్యూస్ అంటూ చెప్తుంది. కాని ఇప్పటి వరకు ఆమె మళ్లీ క్లారిటీ ఇవ్వలేదు. కనుక ఆమె బిగ్బాస్ లోకి వెళ్లడం ఖాయం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉంటాయి. కాని ఈసారి మాత్రం ఆమె ఎంట్రీ పై స్వయంగా ఆమె హింట్ ఇచ్చినట్లయ్యింది.