టాలీవుడ్ డైరెక్టర్లలో సురేందర్ రెడ్డిది ప్రత్యేక శైలి. క్లాస్, మాస్ కలగలిపినట్లు ఉంటాయి ఆయన సినిమాలు. అతడొక్కడే నుంచి నిన్నటి సైరా వరకు సురేందర్ రెడ్డి స్టైలిష్ కు పర్యాయపదంగా నిలిచారు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు భారీ ప్రాజెక్టులున్నాయి. వీటిలో అఖిల్ అక్కినేని హీరోగా ''ఏజెంట్'' సినిమా చిత్రీకరణలో ఉంది. మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రధారి. యూరోపియన్ దేశం
హంగేరీలో సినిమా షూటింగ్ జోరుగా జరిగింది.
అనుకోని అంతరాయం
మమ్ముట్టి, అఖిల్ తదితర స్టార్లతో హుషారుగా సాగుతున్న ఏజెంట్ షూటింగ్ కు అనుకోకుండా బ్రేక్ పడింది. డైరెక్టర్ సురేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్ రావడమే దీనికి కారణం. హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి తిరిగివచ్చాక ఈ విషయం బయటపడింది. సురేందర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకూ కొవిడ్ సోకినట్లు సమాచారం. దీంతో వారంతా క్వారంటైన్ కు వెళ్లారు.
తప్పనిసరి విరామం
డైరెక్టర్ కు పాజిటివ్ రావడంతో ''ఏజెంట్''కు బ్రేక్ పడింది. షెడ్యూల్ కు అంతరాయం కలిగింది. కాగా, హంగేరీలో దాదాపు రెండు వారాల పాటు సినిమా షూటింగ్ సాగింది. అఖిల్, మమ్ముట్టిలపై కొన్ని కీలకమైన పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. సురేందర్ రెడ్డి పూర్తిగా కోలుకున్నాకే మళ్లీ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.
స్పై థ్రిల్లర్ ఏజెంట్
ఇటీవల కాలంలో టాలీవుడ్ లో గూఢచర్యం, నిఘా నేపథ్యం కథలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి వాటికి ఆదరణ కూడా ఎక్కువగా ఉంటోంది. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఏజెంట్ కూడా స్పై థ్రిల్లర్ కథాంశమే. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. హిప్‌హాస్ తమీజా సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్, సురేందర్ సినిమా సంయుక్త సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ః ఏడాదిలోనే విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే తాజా పరిణామాలతో 'ఏజెంట్' మరింత ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. 'అతనొక్కడే', 'కిక్', 'రేసుగుర్రం', 'సైరా' చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టైలిష్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు సురేందర్. 'ఏజెంట్' పూర్తయిన తర్వాత అతను పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తో కలిసి ఒక సినిమాను చేయనున్నారు.
యూరప్ లో కొవిడ్ ప్రభావంతోనే
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టినా, యూరప్ లో ప్రభావం ఎక్కువగా ఉంది. రోజువారీ ప్రపంచ కేసుల్లో యూరప్ వే సగం వరకు ఉంటున్నాయి. జర్మనీలో అయితే ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. ఇంగ్లండ్ లోనూ ప్రభావం అధికంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రియా వంటి దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. పైగా యూరప్ లో శీతాకాలం రాబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే వైరస్ వ్యాప్తి పెరుగుతోంది.