టాలీవుడ్ లో బాహుబలి తర్వాత మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి సైరా షూటింగ్ మధ్యమధ్యలో గ్యాప్స్ ఇస్తూ కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు పూర్తయిన భాగానికి పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటూ తర్వాత ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయినప్పటికీ పాటల చిత్రీకరణతో పాటు కీలకమైన టాకీ పార్ట్ ఇంకా బాలన్స్ ఉంది. యుద్ధ నేపథ్యంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ని పూర్తి చేసాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. అయితే గత కొంత కాలంగా వస్తున్న భారీ బడ్జెట్ సినిమాల ఫలితాలు సైరా మీద ఎక్కడ ప్రభావం చూపుతాయో అని మెగా ఫాన్స్ ఆందోళన పడుతున్నారు. దానికి కారణం లేకపోలేదు.
మొన్న వచ్చిన మణికర్ణికతో మొదలుకుని ఆ మధ్య గుణశేఖర్ తీసిన రుద్రమదేవి దాకా ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమాలేవీ గొప్ప విజయాన్ని అందుకోలేకపోయాయి. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తీసిన రజని 2.0 పెట్టుబడి వెనక్కు ఇవ్వలేక కమర్షియల్ ఫెయిల్యూర్ అనే ట్యాగ్ తగిలించుకుంది. సో ఇప్పుడు సైరా ఒకటికి రెండుసార్లు వీటికి కారణాలు విశ్లేషించుకుని అవి రిపీట్ కాకుండా జాగ్రత్త పడాలి. సైరా ఇప్పుడు సౌత్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మీద రూపొందుతున్న చిత్రం.
ఎంత చిరంజీవి హీరో అయినా నార్త్ లో దీన్ని ప్రమోట్ చేయాలి అంటే ప్రత్యేకమైన ప్లానింగ్ ఉండాలి. దానికి తోడు గ్రాఫిక్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఏ చిన్న లోపం ఉన్నా సరే ఆన్ లైన్ లో సోషల్ మీడియా చీల్చి చెండాడుతున్న రోజులివి. అందుకే సురేందర్ రెడ్డి ఆలస్యమవుతున్నా లెక్క చేయక క్వాలిటీ మీద ఫోకస్ పెడుతున్నాడని టాక్. అయితే చరణ్ ఈ ఏడాదే సైరా విడుదల చేస్తామని చెప్పిన మాట నిలవాలి అంటే స్పీడ్ పెంచక తప్పదు. వేసవిలోపే షూటింగ్ పూర్తి చేసుకుంటే పోస్ట్ ప్రొడక్షన్ కు ఓ మూడు నెలల టైం దొరుకుతుంది. చివరిదాకా హడావిడి పడితే ఫలితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది .