‘ధృవ’ ప్రమోషన్లలో భాగంగా తాను చిరంజీవితో సినిమా చేస్తానని సురేందర్ రెడ్డి అంటే.. ఏదో మాట వరసకు అన్నాడనుకున్నారంతా. కానీ ‘ధృవ’ తర్వాతి సినిమాను చిరంజీవితోనే ఫిక్స్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు సురేందర్. ఐతే చిరు-సురేందర్ కాంబినేషన్ అనగానే ఇద్దరి స్టైల్ మిక్స్ చేసి ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తారేమో అన్న అంచనాలు ఏర్పడ్డాయి. కానీ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ఇద్దరూ సినిమా చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఉయ్యాలవాడ కథ మీద చిరంజీవి ఆసక్తి ఈనాటిది కాదు. తన రీఎంట్రీ మూవీగా ఇదే కథను ఎంచుకోవాలని కూడా చిరంజీవి ఓ దశలో అనుకున్నాడు. పరుచూరి సోదరులు స్క్రిప్టు కూడా తయారు చేశారు. కానీ రీఎంట్రీ మూవీ అంటే అభిమానులు ఆశించే అంశాలు వేరు అన్న ఉద్దేశంతో ‘ఖైదీ నెంబర్ 150’ లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్ చేశాడు చిరు. ఫలితం కూడా బాగానే వచ్చింది. ఇప్పుడిక ఏ ఇబ్బందీ లేకుండా ఉయ్యాలవాడ కథతో ప్రయోగం చేయడానికి చిరు రెడీ అయిపోయాడు.
ఐతే ఇప్పటిదాకా సురేందర్ చేసిన సినిమాల కోణంలో చూస్తే.. అతను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఎలా డీల్ చేస్తాడో అన్న సందేహాలు కలుగుతున్నాయి. సురేందర్ సినిమాలు ప్రధానంగా యాక్షన్.. కామెడీ మీద నడుస్తాయి. ‘ధృవ’ అతడికి భిన్నమైన సినిమానే కానీ.. అది రీమేక్. తమిళ వెర్షన్ కు తనదైన శైలిలో స్టైలిష్ లుక్ ఇచ్చి బాగానే తీర్చిదిద్దాడు. ఐతే సామాజిక అంశాలతో దేశభక్తి ప్రధానంగా సాగే స్వాతంత్ర్య సమరయోధుడి కథను అతను ఎలా తీర్చిదిద్దుతాడన్నది ఆసక్తికరం.
సురేందర్ ఇలాంటి సినిమా చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. తన ఇష్టపూర్వకంగా సురేందర్ ఈ కథను ఎంచుకున్నాడా లేక ఆ కథే ఇతడి దగ్గరికి వచ్చిందో? ఏదైతేనేం సురేందర్ కు ఈ కథను డీల్ చేయడం మాత్రం సవాలే. మరి ఈ సవాలును అతనెలా ఛేదిస్తాడో చూడాలి. స్క్రిప్టు పనులు దాదాపుగా పూర్తి కావచ్చిన ఈ సినిమాను వచ్చే నెలలో మొదలుపెట్టే అవకాశముంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/