దగ్గుబాటి సురేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పరిస్థితులు ఎలాంటివైనా తనదైన శైలిలో ఫేస్ చేయటమే తప్పించి అనవసరమైన ఎమోషన్స్ జోలికి ఏ మాత్రం వెళ్లరన్న పేరుంది. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి తీరు ఉండాలో సురేశ్ బాబును చూసి నేర్చుకోవాలన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీ లో ఉన్నా అనవసరమైన ఇష్యూలతో ముడిపడేలా ఆయనకు సంబంధించిన ఒక్కటి కూడా చెప్పలేరన్న పేరుంది. అలాంటి సురేశ్ బాబు తాజాగా తన కంట కన్నీళ్లు ఆగలేవన్న ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాను తాజాగా నిర్మించిన వెంకీ మామ చిత్రం గురించి ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు.
విక్టరీ వెంకటేశ్.. యువ హీరో నాగచైతన్యలు కలిసి నటించిన వెంకీ మామ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఫైనల్ కాపీని చూసిన నిర్మాత సురేష్ బాబు క్లైమాక్స్ లో వచ్చిన భావోద్వేగ సన్నివేశాల్ని చూసి కన్నీళ్లు ఆగలేవన్న మాటను చెప్పారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టిన సురేశ్ బాబు.. రోటీన్ కు భిన్నంగా తన ఎమోషన్స్ ను చెప్పటం గమనరా్హం.
ఏడాదిన్నర క్రితమే జనార్థన్ మహర్షి ఈ కథ చెబితే.. బాగుందని దాన్ని డెవలప్ చేయాలని బాబీకి ఇచ్చినట్లు చెప్పారు. తన చిన్నతనంలో తన మేనమామ సురేంద్రని విపరీతంగా ఇష్టపడేవాడినని.. ప్రతి ఒక్కరికి వారి మేనమామతో చక్కటి అనుబంధం ఉంటుందని.. అలాంటి మామ, అల్లుడు అనుబంధాన్ని తెలియజేసే సినిమా తమ వెంకీ మామగా చెప్పారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం రిజల్ట్ ను ప్రేక్షకులు ఏలా తేల్చేస్తారో చూడాలంటే డిసెంబరు 13 వరకూ వెయిట్ చేయాల్సిందే.