శ్రీరెడ్డి గురించి సురేష్ బాబు ఏమన్నారు

Update: 2018-04-13 05:55 GMT
ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అని పెద్దలు ఊరికే అనలేదు. దాని వెనుక చాలా అర్థమే ఉంది. ఇప్పుడు చిన్న విషయం మొదలుకుని పెద్ద ఇష్యూ దాకా ప్రతిదీ రాద్ధాంతం చేయాలని చూస్తున్న కొన్ని యు ట్యూబ్ ఛానల్స్ పరిస్థితి అచ్చంగా ఇలాగే ఉంది. శ్రీరెడ్డి వివాదం మొదలైనప్పటి నుంచి వీళ్ళ జోరు మామూలుగా లేదు. తన ఇంటర్వ్యూలలో బైట్స్ వాడుకోవడం దగ్గర నుంచి నిన్న మా సంఘం రాజీ చేసుకోవడం దాకా రకరకాల మసాలా కథనాలు రాసి వ్యూయర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే వీటి పట్ల చూసేవాళ్ళు కూడా ఆకర్షితులు కావడం. ఇక శ్రీరెడ్డి వివాదంలో తీవ్ర సంచలనం రేపిన అభిరాం విషయంలో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి నిజానికి ఇప్పటి దాకా ఎవరూ రెస్పాండ్ కాలేదు. ఫోటోలు చాలా స్పష్టంగా ఉండటటంతో పాటు కీలక ఆధారంగా ఇప్పటికే వైరల్ కావడం వల్ల తొందరపడి మాట్లాడితే వరస ప్రశ్నలు ఎదురుకోవాల్సి వస్తుందనే సైలెంట్ గా ఉన్నారు అనుకోవచ్చు.

కాని నిన్న మొన్న కొన్ని యు ట్యూబ్ వీడియోస్ లో శ్రీరెడ్డి గురించి సురేష్ బాబు స్పందన అంటూ ఒక వీడియోను ప్రచారం చేయటం మొదలుపెట్టారు. అందులో సురేష్ బాబు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నట్టు రాజీ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా అగ్ర నిర్మాతలు అందరు కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని చెప్పినట్టుగా అందులో ఉంది. స్వయంగా ఆయన మాట్లాడాడు కాబట్టి టెక్నాలజీ మీద అవగాహన లేని వాళ్ళు నిజమే అనుకున్నారు. కాని వాస్తవానికి అది కొత్త వీడియో కాదు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తో వివాదం రేగి సమ్మె దాకా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నిర్మాత నట్టి కుమార్ సురేష్ బాబు తో సహా పలువురి మీద తీవ్ర ఆరోపణలు చేసారు. వాటికి సమాధానంగా సురేష్ బాబు ఆ ఇష్యూ ని అడ్రెస్ చేస్తూ మాట్లాడిన వీడియోనే అది. అందులో నట్టి కుమార్ కాని ఇంకెవరి పేరు కాని సురేష్ బాబు ప్రస్తావించలేదు. అందుకే ఇప్పుడు అది బాగా సింక్ అయిపోయింది.

సో సురేష్ బాబు స్పందించారు అన్నది అబద్దం. ఛాలెంజ్ అనే పాత చిరంజీవి సినిమాలో హీరో పాత్ర వేర్వేరు సందర్భాల్లో మాట్లాడిన మాటలను విలన్ గొల్లపూడి మిక్స్ చేసి తప్పుడు అర్థం వచ్చేలా సుహాసినికి వినిపించి ఇద్దరికీ అపార్థం కలిగేలా చేస్తాడు. ఇప్పుడు ఈ యు ట్యూబ్ ఛానల్స్ చేస్తున్న పని అచ్చంగా ఇదే. దేని గురించో మాట్లాడిన వీడియోను పట్టుకుని ఇలా పెడార్ధాలు తీయటం చూస్తూనే వ్యూస్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధం అనేలా ఉన్నారు.

వీడియో ని చూడటానికి క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News