స్టూడియో లోపల ఫుడ్ కోర్ట్ పెడుతున్నారా?

Update: 2016-10-12 05:36 GMT
ఈ మధ్య కాలంలో బాగా మారిపోయిన విషయాల్లో ఫుడ్ కోర్టులు కూడా ఒకటి. గతంలో ఫుడ్ కి ప్రాధాన్యం ఉన్నా.. వెరైటీ ఆఫ్ ఫుడ్స్-క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనే అంశాలకు తక్కువ ప్రాధాన్యత ఉండేది. కొన్ని ఏరియాల్లో అయితే అసలు ఈటింగ్ అనే మాట అనుమతించేవారు కాదు. అలాంటి వాటిలో రామానాయుడు స్టూడియోస్ కూడా ఒకటి.

ఇన్ని దశాబ్దాల రామానాయుడు స్టూడియోస్ హిస్టరీలో అసలు ఓ కాఫీ షాప్ కూడా లేదంటే ఆశ్చర్యం వేసే విషయమే. ఇక్కడకి వచ్చేవాళ్లు ఎవరి ఏర్పాట్లు వారే చేసుకోవాలి. లేదా బైటకు వెళ్లి ఫుడ్ తినేసి రావాలి. కానీ కాలం మారుతోంది. ఇప్పుడు స్టూడియో ప్రెమిసిస్ లోనే ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు ఆలోచిస్తున్నారట సురేష్ బాబు. ముఖ్యంగా ఫిలిం స్కూల్ విద్యార్ధుల కోసమే ఈ ఆలోచన చేయక తప్పలేదని అంటున్నారు. ప్రస్తుతం స్కూల్ స్టూడెంట్స్ ఫుడ్ కోసం చాలా దూరం వెళ్లి ఆహారం తినాల్సి వస్తోంది. అది కూడా ఆ పరిసరాల్లో హైజీన్ ఫుడ్ లభించక ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని సురేష్ బాబు నోటీస్ చేశారని అంటున్నారు.

అందుకే ఈ విషయంలో తీవ్రంగా ఆలోచించిన ఆయన.. తామే ఓ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసేందుకు డిసైడ్ అయ్యారు. దీని ఏర్పాటు తర్వాత షూటింగ్స్ నిర్వహించుకునే వారికి.. విజిటర్స్ కు మరింతగా ప్రయోజనం చేకూరనుంది. ఏమైనా కాలంతో పాటు రామానాయుడు స్టూడియోస్ లో కూడా మార్పులు రాకతప్పదనే సంగతి యాక్సెప్ట్ చేయాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News