‘కబాలి’ సినిమా విడుదలకు ముందు టాలీవుడ్ లో పెద్ద డ్రామానే నడిచింది. రజినీ గత సినిమాలకు సంబంధించిన నష్టాల విషయంలో తమకు న్యాయం చేయాలంటూ కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు. వాళ్లకు కొందరు అగ్ర నిర్మాతలు అండగా నిలిచినట్లు కూడా వార్తలొచ్చాయి. తమను ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టారో ‘కబాలి’ విడుదల తర్వాత మాట్లాడతానని కూడా అన్నాడు నిర్మాతల్లో ఒకడైన కేపీ చౌదరి. ఐతే విడుదల తర్వాత అతను కనిపించట్లేదు. ఈ సినిమా విషయంలో నడిచిన వివాదం గురించి.. థియేటర్లు కబ్జా చేసేస్తున్నారంటూ తనతో పాటు కొందరు నిర్మాతల మీద వస్తున్న విమర్శల మీదా సురేష్ బాబు స్పందించాడు.
‘‘ఈ రోజుల్లో సినిమా బిజినెస్ బాగా పెరిగింది. ఇందులో ప్లేయర్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటారు. అగ్రిమెంట్లు సరిగ్గా ఉండవు. ఒక సినిమా ప్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్లు తమకు కొంత డబ్బు తిరిగి ఇమ్మని అడుగుతారు. కొందరు ఇస్తారు. కొందరు తప్పించుకొని తిరుగుతారు. ఈ గొడవలు ఎప్పుడూ ఉండేవే. ఒకప్పుడు అవి మా ల్యాబుల్లో.. ఆఫీసుల్లో జరిగేవి. ఇప్పుడు మీడియా పెరగడం వల్ల బ్రేకింగ్ న్యూస్ అవుతున్నాయి. కబాలి విషయంలో ఇలాంటి గొడవే నడిచింది. ఇక థియేటర్ల విషయంలో వచ్చేవన్నీ అర్థరహితమైన ఫిర్యాదులు. ఇక్కడో ఉదాహరణ చెబుతాను. ఆదివారం మాల్ కు వెళ్తే జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. పార్కింగ్ దొరకదు. ఎటు చూసినా మనుషులే ఉంటారు. అదే మామూలు రోజుల్లో ఖాళీగా ఉంటుంది. థియేటర్లు కూడా అంతే. మనకున్నవి 1750 థియేటర్లు. వాటిలో ఏడాదికి 150 సినిమాలు ఆడాలి. అందువల్ల పోటీ తప్పదు. పెద్ద సినిమా వస్తే మిగతావన్నీ ఎత్తేయాల్సిందే. ‘కబాలి’ లాంటి సినిమాలు వస్తే వేరే సినిమాలు తీసేయాలి తప్పదు. ఇలాంటి ఇబ్బందులుంటాయి. పరిష్కరించుకోవాలి’’ అని సురేష్ అన్నారు.