కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ అగ్రనిర్మాత డి.సురేష్ బాబు ఓ భయానక యాక్సిడెంట్ చేసిన సంగతి తెలిసిందే. అతడి కార్ వెళ్లి ఓ యాక్టివాని బలంగా గుద్దేయంతో దానిపై వెళుతున్న ముగ్గురు గాల్లో లేచి పడ్డారని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అయితే ఈ యాక్సిడెంట్ లో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా - ఒకరికి మాత్రం తీవ్ర గాయాలై ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. దీనిపై మీడియాలో పెద్ద ఎత్తున స్క్రోలింగులు - రిపోర్టులు ఎన్ని వచ్చినా అసలు ఘటనకు సంబంధించిన స్పష్టమైన సమాచారం మాత్రం బయటకు రాలేదు. స్పాట్ నుంచి డి.సురేష్ బాబు పరారయ్యారని - లేదూ ఆయన కార్ లో లేరు.. డ్రైవర్ తాగి యాక్సిడెంట్ చేసి కార్ వదిలి పారిపోయాడని తొలుత ప్రచారం సాగింది. ఆ తర్వాత పోలీసులు డి.సురేష్ బాబును అరెస్టు చేశారన్న వార్తలు వచ్చాయి.
అదంతా అటుంచితే.. ఈ ఘటన అసలు ఎలా జరిగింది? అసలు వాస్తవాలేంటి? అని డి.సురేష్ బాబును ప్రశ్నిస్తే.. ఆయన చాలా సంగతులే చెప్పారు. ఆరోజు ఆ యాక్సిడెంట్ జరగడానికి ముందు బోలెడంత సీన్ ఉంది. కొంపల్లిలో ఉన్న ఓ ఫ్రెండు ఫ్యామిలీ ఫంక్షన్ కి ఎటెండ్ కావాల్సి ఉంది ఆరోజు. కానీ అది ఎగ్గొట్టి అత్తాపూర్ లో థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తున్నా. ఆ టైమ్ లో ఫోన్ వస్తే ఫంక్షన్ ఎగ్గొట్టి సినిమా చూస్తున్నానంటే బావుండదని వెంటనే కార్ లో కొంపల్లి బయల్దేరాను. ఆ ఫంక్షన్ కి వెళ్లి వస్తుండగానే సికిందరాబాద్ సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. అత్తా పూర్ నుంచి కొంపల్లి వెళ్లి వచ్చానంటే ఆరోజు నా ఫేట్ అలా ఉంది. అయితే ఆ యాక్సిడెంట్ కి కారణం పూర్తిగా వేరే. సడెన్ గా కారు టైర్ ఓ పెద్ద రాయి ఎక్కింది. టైర్ వెంటనే బరస్ట్ అవ్వడంతో అదుపుతప్పి వెళ్లి యాక్టివాని గుద్దింది.. అంటూ తనకు జరిగిన హారిబుల్ ఇన్సిడెంట్ గురించి చెప్పారు.
ఇంతకీ వాళ్ల పరిస్థితేంటి? అని ప్రశ్నిస్తే.. అంతా కూల్. వారికి అవసరమైన అన్ని వైద్య ఖర్చులు భరించాను. ఆ ఘటన తర్వాత నేరుగా నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కూడా చేయించుకున్నా. ఆల్కహాల్ తాగలేదని పోలీసులకు అర్థమైంది. వాళ్లు పూర్తిగా కోలుకున్నారా? అంటే ఇద్దరికి చిన్న గాయాలయ్యాయి. ఒకరికి మాత్రం తీవ్రమైన ఘాయమే అయ్యింది. ఫిజియో థెరపీ అవసరమవుతోంది. అన్నిటినీ దగ్గరుండి చూసుకుంటున్నాం. ఎంతగా అంటే ఇంట్లో నా ఫోటో పెట్టుకున్నారు వాళ్లు... అని చెప్పారు. అసలింతకీ ఆరోజు ఫంక్షన్ ఎగ్గొట్టి సినిమా ఎందుకు చూశారు? అంటే.. ఆ సినిమా బావుందని తెలిసింది.. బావుంటే సినిమా రైట్స్ కొనుక్కుని రీమేక్ చేద్దామనుకున్నానని తెలిపారు. మొత్తానికి ఈ ఘటనతో చాలా విషయాలే తెలిసొచ్చాయి. ఒకటి డి.సురేష్ బాబు సినిమా పిచ్చే ఈ ఘటనకు కారణమని అర్థమవుతోంది. ఆయన సినిమాకి వెళ్లకపోతే తొందరగానే ఫంక్షన్ కి వెళ్లేవారు. అలా యాక్సిడెంట్ తప్పేది. కార్ టైర్ పేలడం వల్లన వాహనం అదుపుతప్పింది. టైర్ కి ఏమీ కాకపోయినా అది జరిగేది కాదన్నమాట!! అంతా ఫేట్!!!