డబ్బింగ్ సినిమాలను వారే రిలీజ్ చేస్తే ఎలా?

Update: 2017-12-29 05:53 GMT
సౌత్ లో ఎక్కువగా ఒక ప్రాంతీయ చిత్రాలు మరో బాషలోకి అనువాదం అయ్యి రిలీజ్ అవ్వడం అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా కోలీవుడ్ సినిమాలు ఇక్కడ మంచి వసూళ్లను రాబడతాయి. ప్రస్తుతం చాలా మంది కోలీవుడ్ హీరోలు ఇక్కడ కూడా ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నారు. అయితే గత కొంత కాలం నుంచి డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ సినిమాలను దెబ్బ తీస్తున్నాయని చాలా మంది సినీ ప్రముఖులు ఆరోపణలను చేశారు.

ముఖ్యంగా చిన్న సినిమాల కలెక్షన్స్ ని చాలా దెబ్బ తీస్తున్నాయని మినిమమ్ థియేటర్స్ కూడా మన తెలుగు సినిమాలకు దక్కడం లేదని వాబోతున్నారు. అంతే కాకూండా చిన్న సినిమాలను బ్రతికించాలని పండగ వాతావరణాలలో డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేయనివ్వకూడదు అనే విధంగా చాలా మంది సినీ నిర్మాతలు ఈ మధ్య చర్చలు జరిపారు. అయితే టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా పేరు తెచ్చుకున్న సురేష్ బాబు ఇప్పుడు డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ సినిమాలకు ఇక్కడ మంచి ఓపెనింగ్స్ అందుతాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే సురేష్ ప్రొడక్షన్స్ ఈ సారి విక్రమ్ స్కెచ్ సినిమాను జనవరిలో రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. జనవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారట. తమన్నా కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలను ఎక్కువగా నిర్మిస్తోన్న సురేష్ ప్రొడక్షన్ డబ్బింగ్ సినిమాలు దెబ్బేస్తున్నాయి అని కొన్ని రోజుల క్రితం చెప్పారు. కానీ ఇప్పుడు వారే ఓ పెద్ద డబ్బింగ్ సినిమాను ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.   
Tags:    

Similar News