నాలో ఆ సంకల్పాన్ని కలిగించింది మెగాస్టార్: సూర్య

Update: 2022-03-04 03:55 GMT
సూర్య తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఈటి' రెడీగా ఉంది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా తమిళంతో పాటు వివిధ భాషల్లో విడుదల కానుంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక మోహన్ అలరించనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూర్య మాట్లాడుతూ .. "నేను హైదరాబాద్ కి వచ్చి మీ అందరినీ కలిసి చాలా చాలా రోజులైంది. దాదాపు రెండేళ్ల తరువాత మీ అందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఈవెంట్ కి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెబుతున్నాను.

ఈ ఫంక్షన్ కి వచ్చిన సురేశ్ బాబుగారికి .. దిల్ రాజుగారికి .. బోయపాటి గారికి .. గోపీచంద్ మలినేనిగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానా కారు ఎపిసోడ్ గుర్తుంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది .. తను చాలా లిటిల్ బ్యాడ్ బాయ్ అంతే. ఈ వేదిక ద్వారా నేను తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాను. ప్రపంచమంతా కోవిడ్ కి భయపడుతుంటే, ఎంతో ధైర్యంతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చారు. 'అఖండ' .. 'పుష్ప'  .. 'బంగార్రాజు' సినిమాలకి భారీ విజయాలను అందించారు. మిగతా ఇండస్ట్రీలకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు.

కరోనా సమయంలో నా నుంచి వచ్చిన 'ఆకాశం నీ హద్దురా' .. 'జై భీమ్' సినిమాలను ఎంతగానో ఆదరించారు. మీరంతా ఆ సినిమాలను ఆదరించిన తీరు .. ప్రోత్సహించిన విధానం నాకు ఎంతో బలాన్నిచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ప్రేమాభిమానాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఇక నేను ఒక ఫౌండేషన్ ను స్టార్ట్ చేయడానికి స్ఫూర్తి చిరంజీవిగారు.
ఆయన ఇచ్చిన ఒక సంకల్పంతోనే నేను ఈ ఫౌండేషన్ ను ముందుకు తీసుకుని వెళుతున్నాను. దాని వెనుక మీ అందరి ప్రోత్సాహం కూడా ఉంది.

మార్పు అనేది ఎవరైనా తీసుకుని రాగలరు . కంఫర్ట్ జోన్ లోనే ఉండాలనుకునేవారు ఎప్పుడూ ఏమీ సాధించలేరు. మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో .. దాని కోసం మీరంతా ధైర్యంగా ముందడుగు వేయండి. పాండిరాజ్ ఈ సినిమాను చాలా గొప్పగా తీశాడు. సినిమా చూసిన తరువాత మీరు కూడా అదే మాట అంటారు. ఇక ప్రియాంక చాలా బాగా చేసింది. జానీ మాస్టర్ విషయానికొస్తే నిజంగా తాను చాలా గ్రేట్ డాన్సర్. 'ఈటి' సినిమా మనసుతో చూడవలససిన సినిమా. ఇతరులను సంతోషపెట్టడంలోనే నిజమైన సంతోషం ఉంటుందని అంటారు. ఈ సినిమాను చూస్తూ మీరంతా ఎంజాయ్ చేస్తారనే అనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.   
Tags:    

Similar News