బందోబస్తుగా గండి కొట్టేసింది

Update: 2019-09-21 07:34 GMT
అనగనగా ఒక విక్రమ్ ఒక కార్తీ ఒక విశాల్ అని గతమెంతో ఘనంగా ఉన్న తమిళ హీరోల తెలుగు మార్కెట్ వరసలో ఇప్పుడు సూర్య కూడా చేరిపోయాడు. గజినీ పుణ్యమాని ఒకప్పుడు తన సినిమా విడుదలవుతోంది అంటే మన పెద్ద స్టార్లు సైతం క్లాష్ అవ్వడానికి ఒకసారి ఆలోచించే రేంజ్ నుంచి మొదటి రోజు మొదటి ఆటకు కనీసం హౌస్ ఫుల్ చేయలేని స్థితికి పడిపోయింది సూర్య మార్కెట్. దానికి మరో నిదర్శనమే బందోబస్త్. నిన్న రిలీజైన ఈ మూవీ మరో ఆల్ టైం డిజాస్టర్ల సరసన చేరిపోయింది.

అసలు ఇది కెవి ఆనంద్ సినిమానేనా అని అనుమానం వచ్చేలా తీసిన తీరు అంతో ఇంతో నమ్మకంతో వెళ్లిన ప్రేక్షకులకు సైతం తీవ్ర నిరాశను మిగిల్చింది. మోహన్ లాల్ -ఆర్య - సాయేషా - సముతిరఖని ఇలా సపోరింగ్ క్యాస్ట్ ఎంత ఉన్నా వీక్ కంటెంట్ వల్ల కోట్ల రూపాయల బడ్జెట్ వృధా అయిపోయింది ఒకప్పుడు ముప్పై కోట్ల దాకా ఉన్న సూర్య మార్కెట్ ఇప్పుడు కనీసం ఫైనల్ రన్ కి ఓ 5 కోట్లు కూడా తీసుకురాలేని స్థితికి పడిపోవడం అంటే నిజంగా విచారించాల్సిన విషయమే.

గతంలో స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి కూడా వెనుకాడకుండా తెలుగు మీద తన ఇష్టాన్ని చూపించిన సూర్య సబ్జెక్టు సెలక్షన్ లో చేస్తున్న తప్పుల వల్ల భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నాడు. విక్రమ్ కార్తీలు కూడా ఇదే తరహాలో ఇక్కడ తమ ఇమేజ్ ని బిజినెస్ ని చాలా దారుణంగా తగ్గించుకున్నారు. నిన్నటి దాకా అంతో ఇంతో ఆశలు ఉన్న సూర్యకు బందోబస్త్ పెద్ద షాక్ ఇచ్చింది. ఇకపై సూర్య అంటేనే బయ్యర్లు భయపడే ఫలితాలు ఈ ఏడాది వచ్చాయి. ఇక ఈ హీరో ఎప్పటికి కోలుకుంటాడో చూడాలి


Tags:    

Similar News