త్రివిక్ర‌మ్‌ తో మూడు ప్లానింగ్స్‌!

Update: 2016-04-30 09:13 GMT
సూర్య...  త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ గురించి చాలా రోజులుగా వార్త‌లొస్తున్నాయి. అయితే అటు సూర్య కానీ, ఇటు త్రివిక్ర‌మ్ కానీ ఆ ప్రాజెక్టు గురించి  స్పందించ‌లేదు. దీంతో వాళ్లిద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తారో లేదో అన్న అనుమానాలు  వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే ఎట్ట‌కేల‌కు సూర్య ఆ సినిమా గురించి  స్పందించారు.

త్రివిక్ర‌మ్‌ తో  చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని, మూడు క‌థలకి సంబంధించిన ప్లానింగ్స్  గురించి మాట్లాడుకున్నామ‌ని, వాటిలో ఏది ఫైన‌లైజ్ అవుతుందో తెలియ‌ని చెప్పాడు సూర్య‌. దీన్నిబ‌ట్టి త‌దుప‌రి త్రివిక్ర‌మ్  చేయ‌బోయే సినిమా సూర్య‌తోనే అన్న విష‌యం అర్థ‌మ‌వుతోంది. ఒక‌వేళ ఆ ప్రాజెక్టంటూ వుంటే తెలుగు - త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతుంద‌ని తెలుస్తోంది.

24 సినిమా ప్ర‌మోష‌న్స్‌ లో భాగంగా శ‌నివారం సూర్య హైద‌రాబాద్‌ లో విలేక‌ర్ల‌తో ముచ్చ‌టించాడు. ఈ సంద‌ర్భంగా స్ట్రెయిట్ తెలుగు సినిమాల గురించి కూడా స్పందించాడు. ``ఎప్ప‌ట్నుంచో తెలుగులో సినిమాలు చేయాల‌నే ఆలోచ‌న వుంది. కానీ కుద‌ర‌డం లేదు. మ‌ధ్య‌లో రాజ‌మౌళి - చంద్ర‌శేఖ‌ర్ ఏలేటిల‌తో సినిమాలు చేసే అవ‌కాశం వ‌చ్చింది. కానీ ఆ అవ‌కాశం చేజార్చుకున్నా. భవిష్య‌త్తులో వాళ్లిద్ద‌రితో త‌ప్ప‌కుండా సినిమా చేస్తా`` అన్నాడు సూర్య‌. 24 సినిమా త‌న జీవితంలో ప్ర‌త్యేక‌మైన సినిమా అని సూర్య స్ప‌ష్టం చేశాడు. నిర్మాత‌గా కూడా మ‌ర‌పురాని చిత్ర‌మ‌వుతుంద‌ని సూర్య చెప్పాడు. మే 6న 24  విడుద‌ల‌వుతోంది.
Tags:    

Similar News