టాలీవుడ్, కోలీవుడ్ లో తిరుగులేని హీరో సూర్య. గజిని సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈరోజు తెలుగు హీరోలకు ధీటుగా పోటీ ఇస్తూ మార్కెట్ ని పెంచుకున్న హీరోగా సూర్యకి పేరుంది. అయితే అందుకు ఇన్ స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి అని సగర్వంగా చెబుతున్నారు సూర్య.
చిరు ఫ్యామిలీ బ్యానర్ లోనే నా మొదటి సినిమా రిలీజై పెద్ద సక్సెసైంది. అపుడెపుడో 'కుట్రాలం' అనేచోట చిరుకి మాకు ఉన్న కామన్ ఫ్రెండ్స్ ద్వారా కొంత విలువైన సమయం తనతో కలిసి గడిపే అవకాశం దక్కింది. అప్పుడు చిరంజీవిగారు సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి, సినిమా ఫిలాసఫీ గురించి ముచ్చటించారు. నా జీవితంలో కీలకమలుపు అదే. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో బ్లడ్ బ్యాంక్, ఐబ్యాంక్ ఎన్నో సేవల్ని అందిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 500లీటర్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉండేది. అలాంటి టైమ్ లో మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రకటన చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరితో నేను ఫోటో దిగడానికి రెడీగా ఉన్నానని అన్నారు. బోలెడంత రక్తం బ్లడ్ బ్యాంక్ కి జమ అయ్యింది. ప్రామిస్ చేసిన ప్రకారమే ఆయన అంతమందితో ఫోటోలు దిగారు. ఇవన్నీ నన్ను ఎంతో ఇన్ స్పయిర్ చేశాయి.
నేను 'అగరం ఫైండేషన్' స్థాపించి 1000 మంది బాలల్ని చదివించడానికి ఆయనే ఇన్ స్పిరేషన్. ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు ఇప్పుడు ఈ ఫౌండేషన్ సాయంతో చదువుకుంటున్నారు. దీనికి ఇన్ స్పిరేషన్ చిరంజీవి గారే. అంతేకాదు ఫ్యామిలీ మ్యాన్ గానూ ఆయన పెద్ద సక్సెస్. అంత పెద్ద కుటుంబాన్ని ఆయనొక్కరే ఎలా హ్యాండిల్ చేస్తున్నారో. అది ఆయన రియల్ లైఫ్ సక్సెస్. ఈ విషయంలోనూ మెగాస్టార్ ఇన్ స్పిరేషన్.. చిరు 60వ పుట్టినరోజుకి వచ్చానంటే ఇలాంటి కారణాలెన్నో అంటూ చెప్పారు సూర్య.