సూర్య ఫ్యాన్స్​​ కు మరోసారి నిరాశ! సినిమా విడుదలకు బ్రేక్​

Update: 2020-10-22 10:30 GMT
తమిళ హీరో సూర్య హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా  సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు.  సూర్య తాజాగా నటించిన చిత్రం  ‘ఆకాశం నీ హద్దురా’. ఇది వేసవిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇన్ని నెలల తర్వాత ఆ సినిమా ఓటీటీ లో    విడుదలకు అమెజాన్ తో డీల్ కుదుర్చుకుంది. ఈ నెల 30 న అమెజాన్ ప్రైమ్ లో ఈ విడుదల కావాల్సి ఉండగా మరోసారి విడుదలకు బ్రేక్ పడింది. దీపావళి కానుకగా నవంబర్​ 13న విడుదల ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం.  ప్రభుత్వం నుంచి మరికొన్ని అనుమతులు రావాల్సిన నేపథ్యంలో అమెజాన్​ ప్రైమ్​ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

 గురు ఫేమ్ సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య పైలట్ పాత్రలో కనిపిస్తాడు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జీఆర్​ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.  సూర్య యొక్క ప్రొడక్షన్ హౌస్ 2 డి ఎంటర్టైన్మెంట్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ నిర్మాత గునీత్ మొంగాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కొన్నేళ్ళుగా సూర్య సినిమాలు వరుసగా బాక్సఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి.ఈ సినిమాతో అయినా సూర్య భారీ హిట్​ అందుకుంటాడని ఫ్యాన్స్​ ఆశిస్తున్నారు.
Tags:    

Similar News