బాలా దర్శకత్వం వహించిన శివపుత్రుడు ఎంతటి సంచలనమో తెలిసిందే. ఈ సినిమాలో చియాన్ విక్రమ్ తో పోటీపడుతూ సూర్య అద్భుతంగా నటించారు. సూర్యను నటుడిగా నిలబెట్టిందే బాలా. అతడి దర్శకత్వంలో మూడు చిత్రాలు సూర్యను గొప్ప నటుడిగా ఆవిష్కరించాయి. అందుకే ఈ కాంబినేషన్ లో నాలుగో సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఫ్యాన్స్ ఆశించినట్టుగానే సూర్య-బాలా కలయికలో నాలుగో చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. కానీ రకరకాల కారణాలతో చిత్రీకరణ ముందుకు సాగలేదు.
ఈ సినిమాకి 'వనంగాన్' అనే టైటిల్ ని నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా నుంచి సూర్య తప్పుకుంటున్నట్లు దర్శకుడు బాలా అధికారిక ప్రకటన విడుదల చేశారు. నిజానికి 2021లో సినిమాని ప్రకటించారు. కానీ కరోనా వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. సూర్య కాల్షీట్లతోను సమస్య ఉంది. దీనికి తోడు ఇప్పుడు తన స్క్రిప్ట్ లో కొన్ని మార్పుల తర్వాత ఇది సూర్య లాంటి స్టార్ కి సరిపోరు.. అని బాలా అన్నారు. ఈ ప్రాజెక్ట్ తో సూర్యకు ఇక ఏ సంబంధం లేదని ప్రకటించారు. ఈ సినిమాని అక్టోబర్ 2021 లో ప్రకటించారు. ఆ తర్వాత సూర్య స్వయంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ ను షేర్ చేసారు. బాలాను 'అన్నయ్య' అని సూర్య అభిమానంగా పిలుస్తారు. సూర్యను బాలా తమ్ముడూ అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు.
అయితే కొన్ని నెలలుగా వనంగాన్ గురించి అనేక పుకార్లు వచ్చాయి. అయితే ఆ పుకార్లను అప్పట్లో సూర్య కొట్టిపారేశాడు. చివరికి ఇప్పుడు అధికారిక ప్రకటనలో బాల మాట్లాడుతూ- "నేను మా తమ్ముడు సూర్యతో వనంగాన్ చిత్రానికి దర్శకత్వం వహించాలనుకున్నాను. అయితే కథలో కొన్ని మార్పులు చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ తన స్టార్ డమ్ కి సరిపోతుందో లేదో నాకు కచ్చితంగా తెలియదు. సూర్యకి నాపై పూర్తి నమ్మకం ఉంది. కానీ అతనిని అలాంటి గమ్మత్తైన పరిస్థితుల్లో పడకుండా చేయడం అన్నయ్యగా నా కర్తవ్యం. కాబట్టి అతను ప్రాజెక్ట్ నుండి వైదొలగాలని మేం ఇరువురం కలిసి నిర్ణయించుకున్నాం'' అని ప్రకటించారు. నిజానికి సూర్య ఈ నిర్ణయంపై చాలా కలత చెందాడని.. అయితే నా సోదరుడి గొప్ప ప్రయోజనం కోసం ఇలా చేయాల్సొచ్చిందని బాలా తెలిపారు.
తాను మళ్లీ సూర్యతో కలిసి పని చేస్తానని అభిమానులకు బాలా హామీ ఇచ్చారు. ''నేను నందలో చూసిన సూర్య.. మీరు పితామగన్ లో చూసిన సూర్య.. మళ్లీ మేమిద్దరం అలాంటి ప్రత్యేకత ఉన్న కథలతో కలుసుకుంటాం'' అని వ్యాఖ్యను జోడించారు.
తన తండ్రితో కలిసి ఉన్న త్రోబ్యాక్ ఫోటోని షేర్ చేస్తూ.. సూర్య 'వనంగాన్' టైటిల్ ని ప్రకటించారు. అతను క్యాప్షన్ లో ఇలా రాసాడు. "అతను (బాలా) నాపై నాకున్న నమ్మకం కంటే ఎక్కువ నమ్మకం కలిగి ఉన్నాడు… అతడు నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాడు. నాకు ఈ గుర్తింపును ఇచ్చాడు…20 సంవత్సరాల తరువాత నేను అదే ఉత్సాహంతో అతని ముందు నిలబడతాను…అప్పా ఆశీస్సులతో నా బాలా అన్నతో మరో అందమైన ప్రయాణం మొదలవుతుంది. .ఎప్పటిలాగే మీ అందరి ప్రేమ శుభాకాంక్షలు కావాలి..!'' అంటూ సూర్య ఎమోషనల్ నోట్ రాసారు.
ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా వివరాల ప్రకారం... ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సూర్యకు చెందిన ప్రొడక్షన్ హౌస్ 2D ఎంటర్ టైన్మెంట్ కూడా ఈ చిత్రం నుండి వైదొలిగింది. సూర్య చివరిసారిగా కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ 'విక్రమ్' లో అతిధి పాత్రలో కనిపించాడు. తదుపరి వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. అతడు నటిస్తున్న హిస్టారికల్ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.