నంద గోపాల కృష్ణుడిగా సూర్య

Update: 2018-07-22 09:40 GMT
ఈ సంక్రాంతికి ‘గ్యాంగ్’ సినిమాతో పలకరించాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఆ చిత్రం అతడికి ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీనికంటే ముందు సూర్య నటించిన సినిమాలు కూడా అంతంతమాత్రంగానే ఆడాయి. ఇప్పుడు అతడి ఆశలన్నీ విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందిస్తున్న ‘ఎన్జీకే’ మీదే ఉన్నాయి. సెల్వ సినిమాలంటేనే వైవిధ్యానికి మారు పేరుగా ఉంటాయి. అలాంటి దర్శకుడితో సూర్య లాంటి నటుడు జట్టు కట్టడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇంటెన్స్ గా ఉండి ఆకట్టుుకుంది. తాజాగా ఈ సినిమా సెకండ్ లుక్ లాంచ్ చేశారు. గడ్డం బాగా పెంచి.. కాలర్ ఎగరేస్తూ పైకి చూస్తున్న లుక్ తో సూర్య ఆకట్టుకున్నాడు. ఎప్పట్లాగే అతడి కళ్లల్లోని మెరుపు ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాకు ‘ఎన్జీకే’ అనే టైటిల్ ఎందుకు పెట్టారో.. దాని అబ్రివేషన్ ఏంటో జనాలకు ఇన్ని రోజులు అర్థం కాలేదు. ఈ రోజు ఆ సంగతి వెల్లడించారు. ఎన్జీకే అంటే నంద గోపాల కృష్ణ అట. దాన్నే షార్ట్ గా ‘ఎన్జీకే’ చేశారు. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ అని.. సూర్య ఒక స్టూడెంట్ లీడర్ పాత్ర పోషిస్తున్నాడని అంటున్నారు. చేగువేరాను తలపించేలా అతడి పాత్ర ఉంటుందంటున్నారు. ప్రకాష్ బాబు.. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెల్వ రాఘవన్ ఆస్థాన సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇందులో సాయిపల్లవి.. రకుల్ ప్రీత్ సూర్యతో జోడీ కడుతుండటం విశేషం. దీపావళి కానుకగా నవంబరు 6న ఈ చిత్రాన్ని తమిళ.. తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ కూడా నిర్మాణ భాగస్వామి కావడం విశేషం.
Tags:    

Similar News