తమిళ స్టార్ హీరో సూర్య సినిమా అంటే తంబీలకే కాదు - తెలుగు అభిమానులకు అంతే క్యూరియాసిటీ ఉంటుంది. ఎన్ని ఫ్లాపుల్లో నటించినా గజిని సూర్య.. సింగం సూర్య.. అంటూ ఇంకా ఏదో ఆశిస్తారు. అందుకే అతడి సినిమా అప్ డేట్స్ వేడి పెంచుతుంటాయి. గ్యాంగ్ తర్వాత సూర్య కొంత గ్యాప్ తీసుకుని ఎంతో ఆలోచించి చేస్తున్న సినిమా ఎన్ జీకే. సెల్వ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య ఈ చిత్రంలో విప్లవ సమరయోధుడిగా కనిపించనున్నాడు. చెగువేరాకు ప్రతిరూపంగా అతడి తొలి పోస్టర్ ఉత్కంఠ పెంచింది. ఇందులో స్టూడెంట్ రాజకీయాలు - వేడెక్కించే యాక్షన్ ఉంటుందని ఇటీవల రివీల్ చేసిన సెకండ్ లుక్ డిక్లేర్ చేసింది.
అదంతా సరే.. ఈ సినిమాని అనుకున్నట్టే దీపావళికి రిలీజ్ చేస్తున్నారా? అంటే సందేహమేనని తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు సెల్వరాఘవన్ అనారోగ్యంతో నీరస పడిపోయాడట. అతడికి కొంతకాలంగా ఆరోగ్యం బాగా లేక చికిత్స పొందుతున్నాడని తెలుస్తోంది. దీంతో ఎన్ జీకే షెడ్యూల్స్ వాయిదా తప్పడంలేదని, దానివల్ల రిలీజ్ వాయిదా పడిందని చెబుతున్నారు. ఆ మేరకు తమిళ క్రిటిక్ రమేష్ బాలా వివరాలందించారు. మొత్తానికి దర్శకుడి నీరసం స్టార్ హీరో సినిమా పోస్ట్ పోన్ కి కారణమైందని ముచ్చటించుకుంటున్నారు. సెల్వరాఘవన్ త్వరగా కోలుకుని వేగంగా సినిమా పూర్తి చేసి అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయాలని ఆకాంక్షిద్దాం.