సెల్వరాఘవన్ దర్శకత్వంలో హీరో సూర్య నటించిన పొలిటికల్ డ్రామా 'NGK'. రకుల్ ప్రీత్ సింగ్.. సాయి పల్లవి హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు మరో కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా తమిళ వెర్షన్ టీజర్ రీసెంట్ గా విడుదలయింది. ఒక నిముషానికి పైగా నిడివి ఉన్న ఈ టీజర్లో స్టొరీ పెద్దగా రివీల్ చెయ్యలేదు కానీ సినిమా నేపథ్యం మాత్రం చూపించారు.
టీజర్ స్టార్ట్ కాగానే "నా పేరు నంద గోపాలన్ కుమరన్.. అందరూ ఎన్జీకే అని పిలుస్తుంటారు" అంటాడు. అయన పిలుస్తుంటాడని ఏదో లైట్ గా చెప్తాడు కానీ నెక్స్ట్ షాట్లో సూర్య కోసం 'ఎన్జీకే... ఎన్జీకే.. ఎన్జీకే' అంటూ జనాలు బిగ్గరగా అరుస్తుంటారు. సూర్య ట్రాక్టర్ తో దున్నుతూ.. ఇతర పొలం పనులు చేస్తూ కనిపిస్తాడు. సాటి రైతులకు స్మార్ట్ ఫోన్ లో ఏదో వివరిస్తూ ఉంటాడు. మరో సీన్ లో "నీలాంటి వారు కనుక రాజకీయాల్లోకి వస్తే ఈ దేశం ఎంత బాగుటుందో" అని ఒక వ్యక్తి సూర్య తో అంటాడు. మరి ఆ ఇన్స్పిరేషన్ తో ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యా డేమో గానీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడు. మరో సీన్లో కార్పోరేట్ ఆఫీస్ లో ఉద్యోగినిలా సూటులో కనిపిస్తున్న రకుల్ "రాజకీయాలా?" అంటూ ఆశ్చర్యంగా సూర్యను ప్రశ్నిస్తుంది. సాయి పల్లవి మాత్రం "నువ్వు అడుగు పెడితే మురుగునీరు కూడా స్వచ్చంగా మారుతుంది" అంటుంది. రాజకీయాలే కాదు.. పొడవాటి కత్తి చేతబట్టి సూర్య కసకసా నారికే వయోలెన్స్ కూడా ఉంది.
నలుగురికి మంచిచేస్తూ.. సరదాగా ఉండే మనిషి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే ఏమౌతుంది? పరిస్థితులు ఎలా మారతాయి అనే ప్లాట్ తో సినిమాను తెరకెక్కించినట్టుగా అనిపిస్తోంది. పాయింట్ కొత్తదేమీ కాదు.. టీజర్లో కూడా సూపర్ అనదగ్గ షాట్లేమీ లేవు. ఇలాంటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథలకు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అవసరం. మరి దర్శకుడు ఆ విషయంలో ఏం చేశాడనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు. సూర్య గత చిత్రాల మాదిరిగానే టెక్నికల్ వ్యాల్యూస్ బాగున్నాయి. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం కొత్తగా ఉంది. తెలుగు 'NGK' టీజర్ రిలీజ్ అయ్యేలోపు ఈ తమిళ టీజర్ పారుంగ..!
Full View