కొత్త సినిమా విడుదలవుతుంటే ముందు రోజు ప్రిమియర్ షో వేయడం.. ఆ షోకు యూనిట్ సభ్యులతో పాటు పరిశ్రమ ప్రముఖులు హాజరవడం ఒకప్పుడు హాలీవుడ్ కే పరిమితం. తర్వాత ఈ సంప్రదాయాన్ని బాలీవుడ్ అందిపుచ్చుకుంది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీల వాళ్లు సైతం ప్రిమియర్ షోలకు బాగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఐతే ఇప్పటిదాకా సౌత్ ఇండస్ట్రీల్లో లోకల్ ప్రిమియర్ షోలకు హీరో, యూనిట్ సభ్యులు హాజరవడమే తప్ప దేశం దాటి వెళ్లింది లేదు. ఐతే సౌత్ నుంచి తొలిసారి అమెరికాలో ప్రిమియర్ షోకు హాజరవుతూ ‘24’ టీమ్ చరిత్ర సృష్టించబోతోంది. ఈ నెల 6న ‘24’ ప్రపంచవ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్లలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే.
ముందు రోజు అమెరికాలో భారీ స్థాయిలో ప్రిమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు. అక్కడ రికార్డు స్థాయిలో 270 దాకా లొకేషన్లలో ‘24’ రిలీజవుతోంది. దాదాపు అన్నిచోట్లా ప్రిమియర్ షోలు గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేశారు. అక్కడికి సూర్య తన టీంతో పాటు వెళ్తున్నాడు. యుఎస్ ఆడియన్స్ తో కలిసి తన సినిమా ప్రిమియర్ షో చూడబోతున్నాడు. అందుకే దాదాపు వారం ముందే తమిళంలో తన సినిమా ప్రమోషన్లు పూర్తి చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో సైతం ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేశాడు. నాలుగో తారీఖుకల్లా అమెరికాకు చేరుకుని మరుసటి రోజు ప్రిమియర్ షోకు హాజరవుతాడు సూర్య. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ‘24’ను సూర్యనే స్వయంగా నిర్మించిన సంగతి తెలిసిందే.