24.. విలన్ క్యారెక్టరే హైలైట్

Update: 2015-11-25 11:30 GMT
ఇష్టం.. 13 బి.. ఇష్క్.. మనం.. వీటిలో ఒక సినిమాకు ఇంకో సినిమాకు ఏమైనా సంబంధం ఉందా? దీన్ని బట్టే చెప్పేయొచ్చు. విక్రమ్ కె.కుమార్ ఎంత విలక్షణమైన దర్శకుడో. ‘మనం’ సినిమాతో టాప్ డైరెక్టర్ల లిస్టులోకి వెళ్లిపోయిన విక్రమ్.. తాను ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న ‘24’ సినిమాను సూర్య హీరోగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల ముందు రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ పోస్టర్లు చూస్తేనే ఇదేదో వైవిధ్యమైన సినిమా అని.. సూర్య సంచలన పాత్రలు చేస్తున్నాడని అర్థమైపోతోంది.

సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ‘24’కు సంబంధించి విక్రమ్ ఇప్పటిదాకా ఏ విశేషాలూ వెల్లడించలేదు. తొలిసారి ఓ ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర సంగతులు చెప్పాడు. అందరూ అనుకుంటున్నట్లే ఇందులో సూర్య మూడు భిన్నమైన పాత్రలు చేస్తున్నట్లు కన్ఫమ్ చేశాడు విక్రమ్. ఒకటి నార్మల్ గా కనిపించే పాత్ర కాగా.. మిగతా రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లలో కనిపించిన క్యారెక్టర్లు. అందులో ఫ్రెంచ్ గడ్డంతో ఉన్నది విలన్ పాత్ర.. ఆ క్యారెక్టర్ పేరు ఆత్రేయ అట. ఇది ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ప్రత్యేకంగా చెప్పుకునే నెగెటివ్ రోల్ అని.. దీన్ని సూర్య తనదైన శైలిలో పోషించాడని విక్రమ్ అంటున్నాడు. సినిమా విడుదలయ్యాక అందరూ ఈ పాత్ర గురించే మాట్లాడుకుంటారని చెబుతున్నాడు. సమంత - నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సూర్యనే స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. వేసవికి ‘24’ ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Tags:    

Similar News