ఇండియాలో ప్రయోగాత్మక పాత్రలు అనగానే కమల్ హాసన్ గుర్తుకొస్తాడు. ఆ తర్వాత విక్రమ్ ఉంటాడు. ‘సేతు’ దగ్గర్నుంచి విక్రమ్ ఎన్నెన్ని ప్రయోగాలు చేశాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఊరికే మేకప్ వేసి అవతారం మార్చుకోవడం కాదు.. సన్నబడ్డానికి తిండి మానేస్తాడు.. నల్లబడ్డానికి ఎండలో నిల్చుంటాడు.. బాలీ బిల్డర్ లా కనిపించడానికి రోజులకు రోజులు జిమ్ముల్లో గడుపుతాడు. గత ఏడాది వచ్చిన ‘ఐ’ సినిమా కోసం విక్రమ్ ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. తన కొత్త సినిమా ‘ఇరుముగన్’ కోసం కూడా విక్రమ్ చాలానే శ్రమించిన సంగతి ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. హీరోగానే కాక.. విలన్ అవతారంలోనూ కనిపించి ఆశ్చర్యపరిచాడు విక్రమ్. పైగా విలన్ క్యారెక్టర్ హిజ్రా కూడా కావడం మరో విశేషం.
ఐతే విక్రమ్ చేసిన ఈ ప్రయోగానికి విలువ తగ్గించేశాడు సూర్య. ఒక నటుడు హీరోగానే కాక పూర్తి స్థాయి విలన్ గానూ కనిపించడం ‘24’ సినిమాలో చూశాం. ‘దశావతారం’లో కమల్ కూడా ఈ ప్రయోగం చేశాడు కానీ.. అందులో ఇంకా చాలా క్యారెక్టర్లు ఉండటం వల్ల దేని మీదా అంతగా ఫోకస్ ఉండదు. కానీ ‘24’ సినిమాలో సూర్య విలన్ పాత్రను అద్భుతంగా పోషించి మెప్పించాడు. సూర్య లాంటి సాఫ్ట్ హీరో అలాంటి పాత్రలో కనిపించి మెప్పించడం అన్నది చిన్న విషయం కాదు. ఈ సినిమా రాకపోయి ఉంటే మాత్రం ‘ఇరుముగన్’ సెన్సేషనల్ అయ్యేది. అయినప్పటికీ సినిమా బాగుంటే విక్రమ్ ప్రయత్నం కూడా వృథా కాదు. అందులోనూ అతను చేస్తోంది హిజ్రా పాత్ర కావడంతో దానికి ఓ ప్రత్యేకత చేకూరింది. సూర్య ముందే ఇలా హీరో-విలన్ పాత్ర చేయడం విక్రమ్ అభిమానుల్ని నిరాశ పరిచినా.. ఇలాంటపుడే విక్రమ్ తన ప్రత్యేకత చాటుకుంటే అతడి విలువ మరింత పెరుగుతుంది. మరి నెగెటివ్ క్యారెక్టర్లో సూర్య కంటే గొప్పగా విక్రమ్ ఏం చేస్తాడో చూడాలి.