ప్రస్తుతం ఎన్జికె ఫినిషింగ్ స్టేజి లో బిజీగా ఉన్న హీరో సూర్య దీంతో పాటు సమాంతరంగా కాప్పన్ అనే మరో మల్టీ స్టారర్ కూడా చేస్తున్నాడు. ఇది కూడా ముప్పాతిక భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. మలయాళం కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తో పాటు ఇటీవలే ఏకమైన కొత్త జంట ఆర్య-సాయేషాలు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన కీలకమైన అప్ డేట్ ఒకటి చెన్నై మీడియాలో చక్కర్లు కొడుతోంది.
దాని ప్రకారం మోహన్ లాల్ ఇందులో భారతదేశ ప్రధాన మంత్రిగా కనిపించబోతున్నాడు. ఆయనకు సెక్యూరిటీ అందించే స్పెషల్ ఆఫీసర్ గా సూర్య చాలా ప్రత్యేకమైన లుక్ ఓవర్ తో చేస్తున్నాడు. ప్రైమ్ మినిస్టర్ ని మట్టుబెట్టే తీవ్రవాదిగా ఆర్య పాత్ర టెర్రిఫిక్ గా ఉంటుందని ఇన్ సైడ్ టాక్
ఇలాంటి లైన్ తో సినిమాలు ఈ మధ్య కాలంలో రావడం లేదు. ఒకప్పుడు సురేష్ గోపి మమ్ముట్టిలు మలయాళంలో దీన్నో ట్రెండ్ గా నడిపారు. అవి డబ్బింగ్ రూపంలో వచ్చి తెలుగులో కూడా బాగానే ఆడాయి. తర్వాత వీటి జోరు తగ్గిపోయింది. ఢిల్లీ రాజకీయాలు నేపధ్యంలో 90లో ఇవి రాజ్యమేలాయి. ఇప్పుడీ కాప్పన్ కూడా అదే స్థాయిలో ఉంటుందని వినికిడి. రంగంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కెవి ఆనంద్ టేకింగ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుందట. ఎన్జికె విడుదల తర్వాత కాప్పన్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తారు. తెలుగు వెర్షన్ నిర్మాత టైటిల్ ఇంకా ఖరారు కాలేదు.